తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కోహ్లీ ఉత్తమ బ్యాట్స్​మన్​.. ఏబీ విలక్షణ క్రికెటర్' - కోహ్లీ

టీమ్​ఇండియా కెప్టెన్​​ కోహ్లీ ఉత్తమ బ్యాట్స్​మన్​ అని, డివిలియర్స్ విలక్షణ క్రికెటర్​ అని చెప్పాడు ప్రముఖ ఆటగాడు స్టీవ్​ స్మిత్​.

Virat Kohli best ODI best batsman in world: Steve Smith ahead of IPL 2020
ఉత్తమ బ్యాట్స్​మన్​ కోహ్లీ.. విలక్షణ ఆటగాడు డివిలియర్స్​

By

Published : Sep 10, 2020, 9:03 AM IST

ప్రపంచంలోని ప్రస్తుత వన్డే బ్యాట్స్​మెన్​లలో తన దృష్టిలో విరాట్​ కోహ్లీ అత్యుత్తమమని ఆస్ట్రేలియా క్రికెటర్​ స్టీవ్​ స్మిత్​ చెప్పాడు. దక్షిణాఫ్రికా క్రికెటర్​ ఏబీ డివిలియర్స్​ విలక్షణ ఆటగాడని తెలిపాడు. ఇంగ్లాండ్​ పర్యటనలో ఉన్న​ స్మిత్​.. ఇన్​స్టా లైవ్​​లో నెటిజన్లు అడిగిన ఆసక్తికర ప్రశ్నలకు సమాధానమిస్తూ ఇలా చెప్పాడు.

మీ దృష్టిలో ప్రపంచంలోనే ఉత్తమ వన్డే బ్యాట్స్​మన్?

స్మిత్​ :ప్రస్తుతం అయితే విరాట్​ కోహ్లీ.

స్టీవ్​ స్మిత్​ ఇన్​స్టాగ్రామ్​ స్టోరీస్​

ఏబీ డివిలియర్స్​ గురించి ఒక్క మాటలో?

స్మిత్​ : విలక్షణ ఆటగాడు

స్టీవ్​ స్మిత్​ ఇన్​స్టాగ్రామ్​ స్టోరీస్​

సంజూ శాంసన్​ గురించి ఒక్క మాటలో?

స్మిత్​ : ప్రతిభావంతుడైన క్రికెటర్​

స్టీవ్​ స్మిత్​ ఇన్​స్టాగ్రామ్​ స్టోరీస్​

కేఎల్​ రాహుల్​ గురించి ఒక్క మాటలో?

స్మిత్​ : గన్​

స్టీవ్​ స్మిత్​ ఇన్​స్టాగ్రామ్​ స్టోరీస్​

హాయ్​ స్టీవ్​! జోస్​ బట్లర్​ గురించి ఏదైనా చెప్పండి?

స్మిత్​ : భయంకరమైన ఆటగాడు. ఈ వారం జరగబోయే వన్డేల్లో మా జట్టుపై ఎలాంటి పరుగులు చేయకూడదని కోరుకుంటున్నాను. ఐపీఎల్​లో తనకు ఇష్టమైనన్ని పరుగులు చేయొచ్చు (నవ్వుతూ).

స్టీవ్​ స్మిత్​ ఇన్​స్టాగ్రామ్​ స్టోరీస్​

క్రికెట్​లో ఎప్పటికీ మీరు అభిమానించే ఫీల్డర్స్​?

స్మిత్​ : జాంటీ రోడ్స్​, రికీ పాంటింగ్​

స్టీవ్​ స్మిత్​ ఇన్​స్టాగ్రామ్​ స్టోరీస్​

ప్రస్తుతం ఇంగ్లాండ్​ పర్యటనలో ఉంది ఆస్ట్రేలియా. ఇటీవలే మూడు మ్యాచ్​ల టీ20 సిరీస్​ను ఇంగ్లాండ్​ కైవసం చేసుకుంది. శుక్రవారం నుంచి ఇరుజట్ల మధ్య వన్డే సిరీస్​ ప్రారంభం కానుంది. ఇది​ పూర్తయ్యాక ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్​ ఆటగాళ్లు ఐపీఎల్​ ఆడేందుకు యూఏఈ చేరుకుంటారు. ఈ నెల 19 నుంచి ఆరంభం కానుంది టోర్నీ. చెన్నై సూపర్​కింగ్స్​, ముంబయి ఇండియన్స్​ మధ్య తొలి మ్యాచ్​ జరగనుంది.

ABOUT THE AUTHOR

...view details