తెలంగాణ

telangana

ETV Bharat / sports

స్విట్జర్లాండ్​ నుంచే కొత్త సంవత్సర శుభాకాంక్షలు - cinema news

ప్రస్తుతం విహారయాత్రలో ఉన్న విరుష్క జోడీ.. ఇన్​స్టా వేదికగా అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. 2020 మరింత బాగా ఉండాలని కోరుకున్నారు.

విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ నూతన సంవత్సర శుభాకాంక్షలు
విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ

By

Published : Jan 1, 2020, 9:48 AM IST

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ... తన సతీమణి అనుష్క శర్మతో కలిసి శీతల దేశం స్విట్జర్లాండ్‌లో విహరిస్తున్నాడు. ప్రస్తుతం అక్కడి నుంచే, వారిద్దరూ తమ అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. మంచు కొండల్లో నిల్చుని ఉన్న ఈ వీడియోలో విరుష్క జంట అందంగా కనిపించింది.

'అందమైన ప్రదేశం నుంచి మీ అందరికి ముందస్తు శుభాకాంక్షలు' అని విరాట్ అన్నాడు. '2019 మీ అందరికీ సంతృప్తికరంగా గడిచిందని ఆశిస్తున్నా. 2020 మరింత బాగా ఉండాలని కోరుతున్నా. మీ అందరికీ మా ఇద్దరి తరఫున శుభాకాంక్షలు' అని అనుష్క చెప్పింది.

త్వరలో శ్రీలంకతో ప్రారంభమయ్యే టీ20 సిరీస్​ ఆడనున్నాడు కోహ్లీ. ఇందులో భాగంగా మూడు మ్యాచ్​లు జరగనున్నాయి. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్​ జరగనుంది.

ABOUT THE AUTHOR

...view details