ప్రస్తుత క్రికెట్లో తాను ఉండుంటే, టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో మంచి అనుబంధం కొనసాగించే వాడినని చెప్పాడు పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్. మైదానంలో శత్రువుల్లాగా, బయట మంచి స్నేహితులుగా మెలిగేవాళ్లమని తెలిపాడు.
"పంజాబీలు కావడం వల్ల నేను, కోహ్లీ మంచి స్నేహితులుగా ఉండేవాళ్లం. కానీ, మైదానంలో అడుగుపెడితే శత్రువులుగా అత్యుత్తమంగా ఆడేవాళ్లం. నా బౌలింగ్‌లో కట్, పుల్‌షాట్లు ఆడలేవని తనకు చెప్పేవాడిని. కోహ్లీ బ్యాటింగ్ చేస్తుంటే వికెట్లకు దూరంగా బంతిని విసురేవాడినని. ఆ సమయంలో తనకు ఇష్టమైన షాట్‌ను ఆడమని బలవంతం చేసేవాడిని"
-షోయబ్ అక్తర్, పాకిస్థాన్ మాజీ పేసర్
మరోవైపు కోహ్లీ ఆటపై దృష్టిని మరల్చేలా, అతడిని మాటలతో మాయ చేసేవాడినని చెప్పాడు అక్తర్. కోహ్లీతో ఛాలెంజ్ చేస్తే అతడు ఆటపై మరింత దృష్టి సారిస్తాడని తెలిపాడు. వసీం అక్రమ్, వకార్ యూనిస్, షేన్ వార్న్ లాంటి బౌలర్లను ఎదుర్కొనే ఛాలెంజ్లనూ కోహ్లీ ఆస్వాదించేవాడని షోయబ్ అన్నాడు.
అక్తర్.. పాక్ తరఫున అన్ని ఫార్మాట్లలో 224 మ్యాచ్‌లు ఆడాడు. 444 వికెట్లు తీశాడు. మరోవైపు అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్న కోహ్లీ.. అన్ని ఫార్మాట్లలో కలిపి ఇప్పటివరకు 70 శతకాలు నమోదు చేశాడు. దిగ్గజ సచిన్ తెందుల్కర్ 100 సెంచరీల ఘనతను అధిగమించేలా కనిపిస్తున్నాడు.
ఇదీ చూడండి... పోలీసు విధుల్లో భారత మహిళా ఫుట్‌బాలర్