ప్రస్తుత క్రికెట్‌లో టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీ, పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ బాబర్ అజామ్ ఎంతో మెరుగ్గా రాణిస్తూ అందరి చేతా ప్రశంసలు అందుకుంటున్నారు. ఇటీవల వీరిద్దరిలో ఎవరు గొప్ప బ్యాట్స్‌మన్ అనే చర్చ కూడా క్రికెట్ వర్గాల్లో నడుస్తోంది. అలాంటిది వీరిద్దరినీ క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్‌తో పోల్చాడు వెస్టిండీస్ మాజీ బౌలర్ ఇయాన్ బిషప్.
"విరాట్ కోహ్లీ, బాబర్ అజామ్ స్ట్రైట్‌గా ఆడటం చూస్తే సచిన్ గుర్తొస్తాడు. లిటిల్ మాస్టర్ అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అనడానికి ఒక కారణం ఉంది. నా బౌలింగ్‌లో అతనెప్పుడూ ఆధిపత్యం చెలాయిస్తాడు. ఇప్పుడున్న బ్యాట్స్‌మెన్‌లో కోహ్లీ, బాబర్ అలాగే ఆడుతున్నారు."