టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఈ ఏడాది తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. కానీ పాప వామికకు సంబంధించిన ఫొటోను మాత్రం ఇప్పటివరకు షేర్ చేయలేదు. సామాజిక మాధ్యమాల్లో అందుకు సంబంధించిన కొన్ని పోస్టులు ప్రత్యక్షమవుతున్నా పూర్తి ముఖం మాత్రం ఇప్పటివరకు కనిపించలేదు. దీంతో కోహ్లీ బిడ్డను చూడటానికి అభిమానులు ఆత్రుతగా ఉన్నారు.
ఎయిర్‌పోర్ట్‌లో ఫ్యామిలీతో కోహ్లీ.. నెటిజన్ల కామెంట్లు! - కోహ్లీ, అనుష్క, వామిక
ఇంగ్లాండ్‌తో వన్డేల కోసం టీమ్ఇండియా సారథి కోహ్లీ తన కుటుంబంతో సహా పుణె బయల్దేరి వెళ్లాడు. ఈ క్రమంలో ఎయిర్పోర్ట్ వద్ద అతడి భార్య, బిడ్డ వామిక కనిపించారు. ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
తాజాగా ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ కోసం పుణె బయల్దేరింది టీమ్ఇండియా. ఈ క్రమంలో ఆటగాళ్లు వారి కుటుంబంతో సహా అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చారు. కోహ్లీ కూడా అతడి భార్య అనుష్క, బిడ్డ వామికతో కనిపించాడు. అనుష్క వామికను ఎత్తుకుని ఉండగా, కోహ్లీ లగేజ్‌తో ఉన్నాడు. కానీ వామిక పూర్తి ముఖం కనిపించకుండా కవర్ చేశారు. దీంతో మరోసారి నిరాశకు గురయ్యారు ఫ్యాన్స్. కొందరు ఈ ఫొటోలపై కామెంట్లు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు పెళ్లయ్యాక కోహ్లీ ఎలా మారిపోయాడో చూడండి అంటూ పోస్టులు పెడుతున్నారు.