ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యమిచ్చే టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. లాక్‌డౌన్‌లోనూ తన కసరత్తులు కొనసాగిస్తున్నాడు. అప్పుడప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతోనూ వాటిని పంచుకుంటున్నాడు. తాజాగా అతను గురువారం పోస్టు చేసిన ఓ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.
అందుకే కోహ్లీని 'ఫిట్‌నెస్ కా బాప్' అంటారు!
టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. తన ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యమిస్తాడు. లాక్డౌన్లో పలు కసరత్తులు చేస్తూ కొన్ని వీడియోలు షేర్ చేశాడు. తాజాగా క్లాప్ పుష్అప్స్ చేస్తోన్న వీడియోను తన సోషల్మీడియా ఖాతాలో అభిమానులతో పంచుకున్నాడు విరాట్.
అందుకే కోహ్లీని ఫిట్నెస్కా 'బాప్' అంటారు!
ఎగురుతూ పుష్ అప్స్ చేసే క్రమంలో నేలను తాకకముందే చప్పట్లు కొట్టడం అతని ఫిట్‌నెస్ సామర్థ్యానికి అద్దం పడుతోంది. గతవారం హార్దిక్ పాండ్య ఎగురుతూ పుష్ అప్స్ చేసిన వీడియోకు కోహ్లీ తనదైన శైలిలో ఇలా సమాధానమిచ్చాడు. "హే.. హార్దిక్ పాండ్యా నువ్వు ఎగురుతూ చేసిన పుష్ అప్స్ నచ్చాయి. వాటికి చప్పట్లను జత చేస్తున్నా" అని ఆ వీడియోకు కోహ్లీ క్యాప్షన్ ఇచ్చాడు.