తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీ ఇలా ఉండటానికి కారణం వారిద్దరే: గంభీర్ - విరాట్​ కోహ్లీ టీమిండియా సారథిగా విజయవంతం అవ్వడానికి  ధోనీ, రోహిత్​శర్మలే కారణం

విరాట్​ కోహ్లీ టీమిండియా సారథిగా విజయవంతం అవ్వడానికి ధోని, రోహిత్​ శర్మలే కారణమని అన్నాడు భారత మాజీ క్రికెటర్​ గౌతమ్​ గంభీర్​. విరాట్​ను​ మెరుగుపర్చడంలో ఇద్దరు ఆటగాళ్లు కీలకంగా వ్యవహరించారని అభిప్రాయపడ్డాడు.

రోహిత్​, ధోనీ వల్లే కోహ్లీ మెరుగయ్యాడు: గంభీర్​

By

Published : Sep 21, 2019, 6:01 AM IST

Updated : Oct 1, 2019, 10:01 AM IST

భారత క్రికెట్​ జట్టు సారథిగా విరాట్​ రాణిస్తున్నాడంటే కారణం ఇద్దరు ఉత్తమ కెప్టెన్లు ధోని, రోహిత్ ​శర్మ జట్టులో ఉండటమే కారణమని అభిప్రాయపడ్డాడు గంభీర్​. కొన్నేళ్లుగా విరాట్ కెప్టెన్‌గా విజయాలు సాధించడంలో మహీ, హిట్​మ్యాన్​ కీలకంగా ఉన్నారని అన్నాడు.

ధోనీ, రోహిత్​, కోహ్లీ

"ఇప్పటికీ కోహ్లీ కెప్టెన్సీ గురించి చర్చించాలి. ప్రపంచ క్రికెట్‌లో కెప్టెన్‌గా కోహ్లీ ఎన్నో విజయాలు సాధించాడు. సుదీర్ఘకాలంగా ధోని, రోహిత్‌లు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించడం వల్లే కోహ్లీ కెప్టెన్‌గా విజయవంతమయ్యాడు. ఓ ఫ్రాంచైజీని నడిపించినప్పుడు ఒకరి కెప్టెన్సీ సామర్థ్యానికి నిజమైన పరీక్ష ఎదురవుతుంది."
-- గంభీర్​, భారత మాజీ క్రికెటర్​

ఇప్పటికే టీమిండియా తరఫున ధోనీ రెండు ప్రపంచకప్​లు తీసుకొచ్చాడని ... రోహిత్​ తన ఐపీఎల్​ జట్టుకు నాలుగుసార్లు ట్రోఫీ అందించాడని పేర్కొన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్‌)లో ఓ జట్టును నడిపించినప్పుడు కెప్టెన్సీ సామర్థ్యానికి పరీక్షని గంభీర్ ఈ సందర్భంగా ప్రస్తావించాడు. ఐపీఎల్​లో బెంగళూరు రాయల్​ ఛాలెంజర్స్​ జట్టుకు ట్రోఫీ రాకపోవడానికిి ధోనీ, రోహిత్​ లాంటి ఆటగాళ్ల సహాయం కోహ్లీకి లేకపోవడమే కారణమని అభిప్రాయపడ్డాడు.

రోహిత్​, ధోనీ

"నేను ఎప్పుడు దీని గురించి మాట్లాడినా నిజాయితీగా మాట్లాడుతున్నా. ముంబయి ఇండియన్స్‌ జట్టు తరఫున రోహిత్ శర్మ ఏం సాధించాడో తెలుసు. చెన్నై సూపర్‌ కింగ్స్‌కు తిరుగులేని కెప్టెన్‌ ధోని. ఆర్సీబీ కెప్టెన్‌గా ఉన్న కోహ్లిని పరిశీలించండి. ఫలితాలు ఏమిటో అందరికీ తెలిసిందే. "

--గంభీర్​, భారత మాజీ క్రికెటర్​

దక్షిణాఫ్రికాతో అక్టోబర్ 2 నుంచి మూడు టెస్టుల సిరీస్‌కు రోహిత్ శర్మను ఓపెనర్​గా ఎంపిక చేయడాన్ని గౌతీ స్వాగతించాడు. కేఎల్‌ రాహుల్‌కు ఓపెనర్‌గా చాలా అవకాశాలు ఇచ్చారని... ఇప్పుడు రోహిత్‌ సమయం వచ్చిందని గంభీర్ పేర్కొన్నాడు. హిట్​మ్యాన్​ను తుది జట్టులో కచ్చితంగా ఆడించాలని సూచించాడు.

Last Updated : Oct 1, 2019, 10:01 AM IST

ABOUT THE AUTHOR

...view details