బాటిల్ క్యాప్ ఛాలెంజ్... ఇటీవల కాలంలో ఎంతో ప్రాచుర్యం పొందింది. హాలీవుడ్ మొదలుకుని టాలీవుడ్ వరకు చాలామంది సినీ ప్రముఖులు, సెలబ్రెటీలు ప్రయత్నించి విజయం సాధించారు. తాజాగా ఈ జాబితాలో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ చేరాడు. కొంచెం ఆలస్యమైనా.. వినూత్నరీతిలో ఈ సవాల్‌ను ఛేదించాడు.
సాధారణంగా ఈ ఛాలెంజ్‌లో బాటిల్‌ను కాలుతో తన్నుతూ.. కిందపడకుండా బాటిల్ నుంచి మూతను వేరు చేయాలి. కానీ కోహ్లీ కాలుకు బదులు బ్యాట్‌ను ఉపయోగించాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో కామెంటరీ వస్తుండడం వల్ల ఈ వీడియో మరింత ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను ట్విట్టర్లో పంచుకున్నాడు కోహ్లీ.