టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతడి సతీమణి అనుష్క శర్మ.. ముంబయి పోలీస్ వెల్ఫేర్‌కు తలో రూ.5 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఈ విషయమై ట్వీట్ చేసిన ముంబయి పోలీస్ కమీషనర్ పరమ్‌బీర్ సింగ్.. వారిద్దరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ మొత్తాన్ని కరోనా కట్టడిలో భాగంగా పోరాడుతున్న వారి సహాయార్థం ఉపయోగిస్తామని రాసుకొచ్చారు.
ముంబయి పోలీస్ వెల్ఫేర్‌కు విరుష్క జోడీ విరాళం - విరాట్ కోహ్లీ తాజా వార్తలు
కరోనా కట్టడి కోసం పోరాడుతున్న ముంబయి పోలీసుల కోసం రూ.10 లక్షలు విరాళమిచ్చింది విరుష్క జోడీ.
కోహ్లీ అనుష్క శర్మ
ఇంతకు ముందు విరుష్క జోడీ.. పీఎమ్ కేర్స్‌తో పాటు మహారాష్ట్ర సహాయనిధికి, కరోనా అరికట్టేందుకు తమ వంతు ఆర్థిక సాయం చేశారు. అయితే ఎంత మొత్తం ఇచ్చారనేది మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం దేశంలోనే అత్యధిక కేసులు మహారాష్ట్రలోనే ఉన్నాయి.