తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీ20 రికార్డు: తొలుత రోహిత్​... తర్వాత కోహ్లీ

భారత క్రికెట్​ జట్టు సారథి విరాట్​ కోహ్లీ, ఉపసారథి రోహిత్​శర్మ మధ్య ఓ రికార్డు దోబూచులాడుతోంది. దక్షిణాఫ్రికాతో రెండో టీ20లో 72 పరుగులు చేసిన కోహ్లీ.. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అయితే చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మూడో టీ20లో తొలుత ఆ రికార్డును రోహిత్​ బ్రేక్​ చేయగా.. మళ్లీ హిట్​మ్యాన్​ నుంచి తన రికార్డును లాగేసుకున్నాడు విరాట్​.

అత్యధిక పరుగుల వీరుడు: తొలుత రోహిత్​... తర్వాత కోహ్లీ

By

Published : Sep 22, 2019, 7:42 PM IST

Updated : Oct 1, 2019, 3:04 PM IST

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఉప సారథి రోహిత్‌ మధ్య పొట్టి ఫార్మాట్​లో ఓ రికార్డు చేతులు మారుతోంది. అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన క్రికెటర్​గా నిలిచేందుకు నువ్వా-నేనా అని పోటీపడుతున్నారు. బెంగళూరులోని చిన్నస్వామి వేదికగాఆదివారం జరిగిన పోరులో తొలుత రోహిత్.. తర్వాత కోహ్లీ అత్యధిక పరుగుల చేసిన వీరుడిగా రికార్డులు సాధించారు.

బ్రేక్​ అయిన నిముషాల్లోనే...

మూడో టీ20లో బరిలోకి దిగిన రోహిత్​.. 8 పరుగులు చేసి టాపర్(2442)​గా చోటు దక్కించుకున్నాడు. గతంలో 2434 పరుగులతో ఈ జాబితాలో రెండో స్థానంలో ఉండేవాడు. అప్పటికి కోహ్లీ 2441 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే విరాట్ అత్యధిక పరుగుల రికార్డు బ్రేక్​ చేసిన రోహిత్​.. అదనంగా ఒక్క పరుగు మాత్రమే జోడించి పెవిలియన్​కు చేరాడు. వన్​ డౌన్​లో బరిలోకి దిగిన కోహ్లీ.. రెండు పరుగులు చేసి 2443 పరుగులతో మళ్లీ తన తొలిస్థానం హిట్​మ్యాన్​ నుంచి లాక్కున్నాడు. 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటై ప్రస్తుతం 2450 పరుగులతో ఉన్నాడు విరాట్.

ధోనీ సరసన రోహిత్​...

భారత్​ తరఫున అత్యధిక టీ20ల్లో పాల్గొన్న ఆటగాడిగా ధోనీ సరసన నిలిచాడు రోహిత్​. వీరిద్దరూ 98 ఇన్నింగ్స్​లు ఆడారు. తర్వాతి స్థానాల్లో రైనా(78), కోహ్లీ(72), యువరాజ్​(58), ధావన్​(55) ఉన్నారు.

Last Updated : Oct 1, 2019, 3:04 PM IST

ABOUT THE AUTHOR

...view details