ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌కు ఉన్న ఆదరణే వేరు. వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది మైదానంలోనూ, ఇంట్లోనూ ఈ ఆటను చూస్తూ ఆస్వాదిస్తుంటారు. ఈ ఏడాది జరిగిన ప్రపంచకప్‌లోనూ 80 ఏళ్ల బామ్మ... ప్రత్యక్షంగా క్రికెట్‌ను చూడటమే కాకుండా కోహ్లీ, రోహిత్‌లను కలిసింది. తనకు ఆటపై ఉన్న మక్కువను వెల్లడించింది. ఎంతో ప్రజాదరణ కలిగిన క్రికెట్ కోసం, ఇటీవలే ఓ జంట తమ జీవితంలోని మధుర క్షణాలనూ లెక్కచేయలేదు.
పెళ్లిరోజూ క్రికెట్‌పైనే ఆ జంట ధ్యాసంతా..! - CoupleGoals by icc
కాన్బెర్రా వేదికగా పాకిస్థాన్-ఆస్ట్రేలియా మధ్య మంగళవారం రెండో టీ20 మ్యాచ్ జరిగింది. అమెరికాలో పెళ్లి చేసుకున్న ఓ జంట... వివాహం తర్వాత మ్యాచ్ చూస్తూ కనిపించారు. ఈ ఫొటోలను ఐసీసీ ట్విట్టర్లో షేర్ చేసింది.
![పెళ్లిరోజూ క్రికెట్‌పైనే ఆ జంట ధ్యాసంతా..!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4980623-679-4980623-1573049395915.jpg)
పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు వీరాభిమాని అయిన హసన్ తస్లీమ్... అమెరికాలోని మిచిగాన్‌లో ఉంటుంది. మంగళవారం వివాహం చేసుకుంది. అదే రోజు పాక్-ఆసీస్ మధ్య రెండో టీ20 జరిగింది. క్రికెట్‌ను అమితంగా ఇష్టపడే ఈమె... పెళ్లి తర్వాత తన భర్తతో కలిసి లైవ్ మ్యాచ్ వీక్షించింది. టీవీలో చూస్తూ ఎంజాయ్ చేసింది. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను ఆమె నెట్టింట షేర్ చేయగా... ఐసీసీ వాటిని పోస్టు చేసింది. ప్రస్తుతం ఇవి వైరల్‌గా మారాయి.
ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఓపెనర్ స్టీవ్ స్మిత్ (80*; 51 బంతుల్లో 11ఫోర్లు, 1సిక్సర్) అదరగొట్టడం వల్ల పాకిస్థాన్‌పై 7 వికెట్ల తేడాతో కంగారూలు విజయం సాధించారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో.. తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా... రెండో టీ20 గెలిచి 1-0తో ఆధిక్యంలో నిలిచింది ఆస్ట్రేలియా. పెర్త్ వేదికగా శుక్రవారం ఆఖరి పోరు జరగనుంది. ఈ ద్వైపాక్షిక టీ20 సిరీస్ తర్వాత రెండు మ్యాచ్లటెస్టు సిరీస్ ఆడనున్నాయి ఇరుజట్లు.