రంజీల్లో పేసర్ వినయ్ కుమార్ కొత్త చరిత్ర సృష్టించాడు. టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన పేసర్‌గా ఘనత సాధించాడు. శనివారం మిజోరాంతో మ్యాచ్‌లో మూడో వికెట్లు తీసి ఈ ఘనత సాధించాడు. ప్రస్తుతం వినయ్ ఖాతాలో 412 వికెట్లు ఉన్నాయి. ఇంతకు ముందు ఈ స్థానంలో ఉన్న పంకజ్ సింగ్(409 వికెట్లు)ను వెనక్కు నెట్టి టాప్‌లోకి వచ్చాడీ బౌలర్.
ఇప్పటివరకు రంజీల్లో రాజీందర్ గోయెల్ అత్యధిక వికెట్లు తీశాడు. 637 వికెట్లతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. తర్వాతి స్థానంలో వెంకట్రాఘవన్(530) నిలిచాడు. వీరిద్దరి మధ్య అంతరం 107 వికెట్లు ఉండడం విశేషం. ఈ జాబితాలో వినయ్ కుమార్ ఏడో స్థానంలో ఉన్నాడు.