తెలంగాణ

telangana

ETV Bharat / sports

''జట్టు గెలుపే ముఖ్యం..'' - india

''ఆసీస్​తో రెండో వన్డేలో చివరి ఓవర్లో రెండు వికెట్లు తీసిన తర్వాత మరీ ఎక్కువగా సంబరాలు చేసుకోలేదు. ఆ క్షణం అనుభూతిని ఆస్వాదించానంతే" అని విజయ్ శంకర్ చెప్పాడు.

విజయ్​శంకర్

By

Published : Mar 6, 2019, 10:16 AM IST

Updated : Mar 6, 2019, 10:46 AM IST

సరిగ్గా ఏడాది క్రితం నిదహాస్ ట్రోఫీ ఫైనల్​లో స్ట్రైక్​ రొటేట్ చేయడానికే ఇబ్బంది పడ్డాడు. తాజాగా నాగ్​పూర్ వన్డే ఉత్కంఠగా సాగుతున్న సమయంలో రెండు వికెట్లు పడగొట్టి జట్టును విజయతీరాలకు చేర్చాడు భారత ఆల్​రౌండర్​ విజయ్​శంకర్. ప్రపంచకప్​ దగ్గరకొస్తున్న తరుణంలో ఆసీస్​తో రెండో వన్డేలో అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్​పై విజయశంకర్ చెప్పిన కొన్ని ఆసక్తికర విషయాలు.

ప్రపంచకప్​లో చోటుపై..
నేను ఇంతవరకు ప్రపంచ కప్​ గురించి ఆలోచించలేదు. ఇంకా చాలా సమయం ఉంది. జట్టు గెలుపు కోసం నా వంతు కృషి చేస్తాను. ప్రతి మ్యాచ్​ ముఖ్యమే.

నిదహాస్ ట్రోఫీలో ప్రదర్శనపై..
గతేడాది జరిగిన నిదహాస్ ట్రోఫీని మర్చిపోలేను. ఆ మ్యాచ్​లో ఒత్తిడిని అధిగమించడం లాంటి చాలా విషయాలను నేర్చుకున్నాను. నిన్న జరిగిన మ్యాచ్​లో 43వ ఓవర్ తర్వాత బౌలింగ్ చేయాల్సి వస్తుందని నాకు ముందే తెలిసింది. మానసికంగా ముందుగానే సన్నద్ధమయ్యాను.

ఫైనల్ ఓవర్​లో..
48వ ఓవర్ అనంతరం బుమ్రా నా వద్దకొచ్చి బంతి రివర్స్​స్వింగ్ అవుతుందని చెప్పాడు. సరైన లైన్​ అండ్ లెంగ్త్​లో వేయమని సూచించాడు. బంతిని సూటిగా వేసినట్లయితే పరుగులు నియంత్రిస్తూనే వికెట్లు తీసే అవకాశముంటుంది.

విజయానంతరం స్పందనపై..
చివరి ఓవర్లో రెండు వికెట్లు తీసిన తర్వాత మరీ ఎక్కువగా సంబరాలు చేసుకోలేదు. ఆ క్షణం ఆ అనుభూతిని ఆస్వాదించానంతే.

రనౌట్​పై..
బ్యాటింగ్​లో 41 బంతుల్లో 46 పరుగులు చేశాను. రనౌట్ కావడం దురదృష్టం అని నేను బావించట్లేదు. కోహ్లీ బంతిని బలంగా కొట్టాడు. క్రీజులోకి వెళ్లే సమయం నాకు దొరకలేదు. ఆటలో ఇలాంటివి సాధారణంగా జరుగుతుంటాయి.

ఆసీస్​ విజయానికి చివరి ఓవర్లో 11 పరుగులు కావాలి. 2 వికెట్లు తీస్తే గెలుపు భారత్​ని వరిస్తుంది. క్రీజులో అర్ధసెంచరీతో జోరుమీదున్న స్టాయినిస్​. అలాంటి పరిస్థితుల్లో బంతి విజయ్ చేతికిచ్చాడు కెప్టెన్ కోహ్లీ. తొలి బంతికే స్టాయినిస్​ని ఔట్​ చేసి మ్యాచ్​ను మలుపు తిప్పాడు. రెండో బంతికి రెండు పరుగుల రాగా, మూడో బంతితో ఆడమ్ జంపాను క్లీన్ బౌల్డ్ చేసి జట్టును గెలిపించాడు.

Last Updated : Mar 6, 2019, 10:46 AM IST

ABOUT THE AUTHOR

...view details