విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా తమిళనాడుతో జరుగుతోన్న ఫైనల్లో కర్ణాటక బౌలర్ మిథున్ అరుదైన రికార్డు సాధించాడు. పుట్టినరోజున హ్యాట్రిక్ సాధించి ఈ ఘనత అందుకున్న కర్ణాటకతొలి క్రికెటర్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో ఐదు వికెట్లు తీసి సత్తాచాటాడు మిథున్. తమిళనాడు 253 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడు.. మిథున్ (5/34) ధాటికి నిర్ణీత 50 ఓవర్లలో 252 పరుగులు చేసింది. మురళీ విజయ్, అశ్విన్ (8).. జట్టు స్కోరు 24 వద్దే పెవిలియన్కు చేరారు. అభినవ్ ముకుంద్ (85, 110 బంతుల్లో), బాబా అపరాజిత్ (66, 84 బంతుల్లో) అర్ధశతకాలు చేశారు.