తెలంగాణ

telangana

ETV Bharat / sports

విజయ్ హజారే ట్రోఫీలో కరోనా కలకలం - విజయ్ హజారే ట్రోఫీ

విజయ్ హజారే టోర్నీలో ఓ బిహార్​ క్రికెటర్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. దీంతో అతని సహచర ఆటగాళ్లకూ కొవిడ్ టెస్టులు చేయనున్నారు. టోర్నీ నిమిత్తం బిహార్​ నుంచి 22 మంది ప్లేయర్లు బెంగుళూరు వచ్చారు.

Vijay Hazare: Bihar player tests positive for COVID-19, others to undergo tests
విజయ్ హజారే ట్రోఫీ: బిహార్​ క్రికెటర్​కు కరోనా

By

Published : Feb 23, 2021, 3:43 PM IST

Updated : Feb 23, 2021, 4:26 PM IST

విజయ్​ హజారే ట్రోఫీలో ఆడుతున్న బిహార్​ ఆటగాడికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. దీంతో అతని సహచర ప్లేయర్లకూ కొవిడ్​ టెస్టులు చేయనున్నారు. ఆ రిపోర్టులు బుధవారం సాయంత్రం రానున్నాయి. ఈ టోర్నీ కోసం బిహార్​ 22 మంది క్రికెటర్లను పంపింది.

"బిహార్​కు చెందిన ఓ ఆటగాడికి వైరస్​ నిర్ధరణ అయ్యింది. ప్రస్తుతం అతడు మిగతా క్రికెటర్లకు దూరంగా బెంగుళూరులో ఐసోలేషన్​లో ఉన్నాడు" అని సీనియర్​ అధికారి తెలిపాడు.

ప్రస్తుతం ఎలీట్​ గ్రూప్​-సీలో ఉన్న బిహార్​ జట్టు.. తన లీగ్​ మ్యాచ్​లన్నీ బెంగుళూరులో ఆడాల్సి ఉంది. తదుపరి మ్యాచ్​ బుధవారం ఉత్తర్​ప్రదేశ్​తో జరగాల్సి ఉంది. కరోనా కలకలం రేగినా.. మ్యాచ్​లు యథావిధిగా జరుగుతాయని బిహార్​ క్రికెట్​ అసోసియేషన్​ పేర్కొంది.

కొవిడ్​ అనంతరం బీసీసీఐ నిర్వహిస్తున్న రెండో అతిపెద్ద టోర్నీ ఇదే.

ఇదీ చదవండి:మొతేరాలో సందడికి వేళాయే.. ఈ విషయాలు తెలుసా?

Last Updated : Feb 23, 2021, 4:26 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details