ఐపీఎల్ ప్రాధాన్యం రోజురోజుకూ పెరుగుతోంది. గతంలో ఈ లీగ్‌లో ఆడేందుకు నిరాకరించిన దేశాలు కూడా ఇప్పుడు తమ ఆటగాళ్లను పంపిస్తున్నాయి. ఈ లీగ్‌కు ఉన్న ప్రాధాన్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రతి జట్టూ గుర్తిస్తోంది. ఇటీవలే ఇంగ్లాండ్ కోచ్ సిల్వర్‌వుడ్ చేసిన ఆ వ్యాఖ్యలు దానికి బలాన్ని చేకూరుస్తున్నాయి.
"ఐపీఎల్‌లో ఆడకూడదని ఆటగాళ్లకు చెప్పడం చాలా కష్టంగా మారింది. ఆ లీగ్ ప్రాధాన్యత గుర్తించిన తర్వాత ఆడకూడదని చెప్పలేం. టీ20 ప్రపంచంలో అదో భారీ క్రికెట్ లీగ్. ఆ లీగ్‌లో మా ఆటగాళ్లు అత్యున్నత స్థాయి క్రికెట్ ఆడుతుండడం మాకూ మేలు చేసేదే. ఐపీఎల్ వేలంలో మార్క్‌వుడ్, మొయిన్ అలీ అమ్ముడుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా"
- సిల్వర్‌వుడ్, ఇంగ్లాండ్ కోచ్
బిగ్‌బాష్ లీగ్‌లో ఆడని కొంతమంది ఇంగ్లాండ్ ఆటగాళ్లు.. ఐపీఎల్ కోసం టీమ్‌ఇండియాతో టెస్టులకు దూరమవుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు ఐపీఎల్ కోసం ఇంగ్లాండ్‌లో సిరీస్‌కు న్యూజిలాండ్ ఆటగాళ్లు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఐపీఎల్ తేదీలు ఇంకా విడుదల కాలేదు. కానీ ఇంగ్లాండ్‌తో లార్డ్స్‌లో కివీస్ ఆడే తొలి టెస్టు జూన్ 2న ఆరంభం కానుంది. ఆ సమయంలో ఒకవేళ ఐపీఎల్ ప్లేఆఫ్ మ్యాచ్‌లు ఉంటే.. విలియమ్సన్, ట్రెంట్ బౌల్ట్ ప్రాతినిథ్యం వహించే జట్లు ప్లేఆఫ్ చేరితే వాళ్లు టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉంటారా? లేదా ఐపీఎల్‌లోనే కొనసాగుతారా? అన్నది సందేహంగా మారింది. అయితే టీమ్ మేనేజ్‌మెంట్ మాత్రం అది ఆటగాళ్ల ఇష్టానికే వదిలేసింది.
ఇదీ చూడండి:కోట్లు కురిసే వేళ.. బరిలో స్టార్ ఆటగాళ్లు