తెలంగాణ

telangana

ETV Bharat / sports

'భారత జట్టు బౌలింగ్ ప్రదర్శన అద్భుతం' - LATEST CRICKET NEWS

భారత బౌలర్లు ప్రస్తుతం బాగా ఆడుతున్నారని చెప్పిన మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్.. జట్టులో ప్రస్తుతం ఉత్తమ పేసర్లు ఉన్నారని అభిప్రాయపడ్డాడు.

Venkatesh Prasad
'భారత జట్టు బౌలింగ్ ప్రదర్శన అద్భుతం'

By

Published : Jun 8, 2020, 3:19 PM IST

టీమ్​ఇండియా ప్రస్తుత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారని భారత మాజీ పేసర్ వెంకటేశ్​ ప్రసాద్​ ప్రశంసించాడు. ఉత్తమ క్రికెటర్లు జట్టులో ఉన్నట్లు పేర్కొన్నాడు. ఇప్పుడున్న బౌలింగ్​ టెక్నిక్​తో ప్రపంచంలోనే అత్యుత్తమంగా తయారు కావాల్సిన అవసరముందని​ సూచించాడు.

"బౌలర్లకు వేగం, ఫిట్​నెస్​, స్వింగ్​ తదితర వైవిధ్యాలెన్నో ఉన్నాయి. బంతులను పేస్​, యార్కర్​, బౌన్సర్​ ఇలా రకరకాలుగా సంధించగలరు. టీమ్​ఇండియాలో ప్రస్తుతం ఉత్తమ ఫాస్ట్​ బౌలర్లు ఉన్నారని నా అభిప్రాయం. నాకు తెలిసి జట్టులో ఐదు నుంచి ఆరుగురు మంచి బౌలర్లు ఉన్నారు. జట్టు కేవలం ఒకరిద్దరు ఆటగాళ్లపై ఆధారపడి ఉంటుందని అనుకోను. ప్రతి ఒక్కరిలోనూ అపారమైన ప్రతిభ దాగుంటుంది"

-వెంకటేశ్​ ప్రసాద్​, భారత మాజీ క్రికెటర్

కెప్టెన్​గా బ్యాట్స్​మెన్​ ఉన్న ట్రెండ్​పైనా ప్రసాద్​ స్పందించాడు. బౌలింగ్​తో పాటు ప్రాతినిధ్యం వహించిన కపిల్​ దేవ్​, అనిల్​ కుంబ్లేలు అరుదైన క్రికెటర్లలో కొందరని చెప్పాడు. బౌలర్లకు మైదానంలో ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల వారిని ఎక్కువగా కెప్టెన్లుగా నియమించలేదని​ అభిప్రాయపడ్డాడు. నాయకత్వ లక్షణాలుంటే ఎవరైనా సరే సారథి​ అవుతారని స్పష్టం చేశాడు.

ABOUT THE AUTHOR

...view details