తెలంగాణ

telangana

ETV Bharat / sports

''మ్యాన్​ ఆఫ్​ ది సిరీస్​' భువీకి రాకపోవడం ఆశ్చర్యం' - భువీ

టీమ్​ఇండియా బౌలర్​ భువనేశ్వర్​కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు ఇంగ్లాండ్​ క్రికెటర్ మైకేల్​ వాన్. 6 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేసిన భువీకి ఆ అవార్డు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించాడు.

Vaughan surprised as Bhuvi not named Man of the Series
ఆ అవార్డు భువీకెందుకు ఇవ్వలేదు?: వాన్

By

Published : Mar 29, 2021, 3:39 PM IST

భారత బౌలర్​ భువనేశ్వర్​ను 'మ్యాన్​ ఆఫ్​ ది సిరీస్'​గా ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్. మూడు మ్యాచ్​ల వన్డే సిరీస్​లో భాగంగా 6 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేశాడు భువీ.

"భువనేశ్వర్ కుమార్ ఎలా 'ప్లేయర్​ ఆఫ్ ది సిరీస్'​ కాదు?" అని వాన్​ ట్వీట్​ చేశాడు.

కాగా, ఇంగ్లాండ్​ ఓపెనర్​ బెయిర్​ స్టోను 'మ్యాన్​ ఆఫ్ ది సిరీస్'​ అవార్డు వరించింది. రెండో వన్డేలో 124 పరుగులతో ఇంగ్లాండ్​ను గెలిపించిన స్టో.. మొత్తంగా ఈ సిరీస్​లో 219 రన్స్​ సాధించాడు.

ఇదీ చదవండి:టెస్టుల్లోకి రీఎంట్రీపై భువనేశ్వర్ స్పందన

ABOUT THE AUTHOR

...view details