ఇంగ్లాండ్‌తో టెస్టు, టీ20 సిరీస్‌లను గెలిచిన టీమ్ఇండియా వన్డేల్లోనూ అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. ఈ సిరీస్‌లో భాగంగా మొదటి వన్డే నేడు పుణె వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో స్పందించిన ఇంగ్లీష్ జట్టు మాజీ సారథి మైఖెల్ వాన్.. భారత జట్టు ఈ సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పాడు.
"నా ముందస్తు అంచనా ప్రకారం భారత్ ఈ సిరీస్‌ను 3-0 తేడాతో గెలుస్తుంది. రూట్, ఆర్చర్ లేకపోవడం పెద్ద లోటు" అంటూ ట్వీట్ చేశాడు వాన్.
టీమ్ఇండియాతో వన్డే సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో రూట్‌కు చోటు దక్కలేదు. అలాగే స్టార్ పేసర్ ఆర్చర్ గాయం కారణంగా దూరమయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు ఇద్దరు స్టార్ ఆటగాళ్లు లేకుండానే బరిలో దిగుతోంది.