తెలంగాణ

telangana

ETV Bharat / sports

శ్రీలంక బౌలింగ్​ కోచ్​ పదవికి వాస్​ రాజీనామా - srilanka cricket board

శ్రీలంక బౌలింగ్​ కోచ్​ పదవికి ఇటీవలే ఎంపికైన చమిందా వాస్.. తాజాగా రాజీనామా చేశాడు. బోర్డుతో వచ్చిన ఆర్థిక విభేదాల కారణంగానే అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు.

Vaas resigns 3 days after being appointed Sri Lanka's bowling coach
శ్రీలంక బౌలింగ్​ కోచ్​ పదవికి వాస్​ రాజీనామా

By

Published : Feb 22, 2021, 10:19 PM IST

Updated : Feb 22, 2021, 11:57 PM IST

శ్రీలంక క్రికెట్​ జట్టు బౌలింగ్​ కోచ్​ చమిందా వాస్​ తన పదవికి రాజీనామా చేశాడు. మూడు రోజుల కిందటే ఆయన ఈ పదవికి ఎంపిక అయ్యాడు. బోర్డుతో వచ్చిన విభేదాల కారణంగానే వాస్​ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

వెస్టిండీస్​ పర్యటన నిమిత్తం లంక జట్టు బయలుదేరే ముందు వాస్​ తన రాజీనామాను సమర్పించాడు. "మేము అతని నిబంధనలతో అంగీకరించలేదు.. అందుకే అతడు రాజీనామా చేశాడు" అని శ్రీలంక క్రికెట్​ బోర్డు సీనియర్ అధికారి పేర్కొన్నాడు.

"కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో వాస్​ తన పారితోషికాన్ని పెంచాలని కోరాడు. అందుకు బోర్డు అంగీకరించలేదు. దీంతో అతడు బౌలింగ్ కోచ్​ పదవికి రాజీనామా చేశాడు. సోమవారం రాత్రి లంక జట్టు వెస్టిండీస్​ బయలుదేరాల్సి ఉంది. ఈ లోపు వాస్​ తన నిర్ణయాన్ని ప్రకటించాడు" అని బోర్డు తెలిపింది.

ఆస్ట్రేలియా క్రికెటర్​ డేవిడ్​ సాకర్​ స్థానంలో లంక బౌలింగ్​ కోచ్​గా చమిందా వాస్​ను గత వారమే నియమించింది బోర్డు. కాగా, డేవిడ్​ ఆధ్వర్యంలో లంక జట్టు సౌతాఫ్రికా, ఇంగ్లాండ్​తో సిరీస్​లలో పేలవ ప్రదర్శన చేసింది.

కాగా.. విండీస్​తో 3 మ్యాచ్​ల వన్డే సిరీస్​, 3 మ్యాచ్​ల టీ20 సిరీస్​తో పాటు 2 టెస్టుల సిరీస్ నిమిత్తం లంక జట్టు ఆ దేశంలో పర్యటించనుంది.

ఇదీ చదవండి:15 ఏళ్ల తర్వాత శ్రీశాంత్​ 5 వికెట్ల ఘనత

Last Updated : Feb 22, 2021, 11:57 PM IST

ABOUT THE AUTHOR

...view details