తెలంగాణ

telangana

ETV Bharat / sports

'భారత్​తో టెస్టు ఆడకపోవడం దురదృష్టం'

టీమిండియాతో టెస్టు మ్యాచ్ ఆడే అవకాశం రాకపోవడం నిరాశగా ఉందన్నాడు పాకిస్థాన్ స్నిన్నర్ యాసిర్ షా. కోహ్లీ లాంటి బ్యాట్స్​మన్​కు బౌలింగ్ చేయడం ఉత్సాహాన్నిస్తుందని చెప్పాడు.

: Yasir Shah
యాసిర్

By

Published : Dec 16, 2019, 8:45 PM IST

టీమిండియాతో ఆడే అవకాశం రాకపోవడం దురదృష్టమనిఅసంతృప్తి వ్యక్తం చేశాడు పాకిస్థాన్ స్పిన్నర్ యాసిర్ షా. కోహ్లీ లాంటి బ్యాట్స్​మన్​కు బౌలింగ్ వేసి తన సామర్థ్యాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నాని చెప్పాడు. త్వరలోనే భారత్​తో ఆడే అవకాశం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

"నా అరంగేట్రం నుంచి భారత్​తో టెస్టు ఆడలేకపోయాననే నిజం.. నన్ను నిరాశకు గురి చేస్తోంది. ఇది దురదృష్టకరం. టీమిండియాతో ఆడాలని ఉంది. ఎందుకంటే ఆ జట్టులో అత్యుత్తమ ఆటగాళ్లు ఉన్నారు. ఓ లెగ్ స్పిన్నర్​గా కోహ్లీ లాంటి టాప్ బ్యాట్స్​మన్​కు బౌలింగ్ చేయడం ఉత్సాహాన్నిస్తుంది."
-యాసిర్ షా, పాక్ స్పిన్నర్

యాసిర్ షా ఇప్పటివరకు 37 టెస్టు మ్యాచ్​లు ఆడి 207 వికెట్లు పడగొట్టాడు. 2011లో సుదీర్ఘ ఫార్మాట్​లో అరంగేట్రం చేసిన ఈ బౌలర్.. ఇప్పటివరకు టీమిండియాతో టెస్టు ఆడలేదు.

2012లో భారత పర్యటనకు వచ్చిన పాకిస్థాన్.. పరిమిత ఓవర్ల సిరీస్​ మాత్రమే ఆడింది. 2008 ముంబయి ఉగ్రదాడి తర్వాత ఇప్పటివరకు పాక్-భారత్ మధ్య టెస్టు మ్యాచ్​ జరగలేదు.

ఇవీ చూడండి.. సన్​రైజర్స్ హైదరాబాద్​​కు స్టార్ బౌలర్ స్టార్క్​!

ABOUT THE AUTHOR

...view details