టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, పాకిస్థాన్ యువ కెరటం బాబర్ అజామ్‌లను పోలుస్తూ చాలామంది కామెంట్లు చేశారు. కానీ ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అంటున్నాడు పాక్ మాజీ క్రికెటర్ యూనిస్ ఖాన్. కోహ్లీ కెరీర్లో ఉన్నత దశలో ఉన్నాడని.. బాబర్ కేవలం 5 ఏళ్ల ముందే కెరీర్ ప్రారంభించాడని తెలిపాడు.
"మీరే గమనించండి. కోహ్లీకి ప్రస్తుతం 31ఏళ్లు. అతడు కెరీర్లో ఉన్నత స్థితిలో ఉన్నాడు. దశాబ్దంపైగా క్రికెట్ ఆడుతున్నాడు. ఇప్పటికే తనను తాను నిరూపించుకున్నాడు. అతడి ఖాతాలో 70 శతకాలు ఉన్నాయి. బాబర్ కెరీర్ ప్రారంభించి ఐదేళ్లే అవుతుంది. ఇప్పటికే 16 సెంచరీలు చేశాడు. టెస్టు, వన్డేల్లో మంచి సగటుతో పరుగులు సాధిస్తున్నాడు. ఈ ఐదేళ్ల క్రికెటర్‌తో మీరు కోహ్లీని పోలుస్తున్నారా!"