వెస్టిండీస్ పర్యటనలో ఎంపికవ్వని భారత క్రికెటర్ మురళీ విజయ్ తన ఆట గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టులో చోటు దక్కనందుకు ఒత్తిడికి గురి కావడం లేదని.. టీమ్ ఏదైనా ఆడటమే తనకు ముఖ్యమని అన్నాడు.
"అవును, నా ఆటకు ఎటువంటి పరిమితులు విధించాలని అనుకోవట్లేదు. నేనేమి ఒత్తిడిలో లేను. ప్రస్తుతం ఈ సమయాన్ని ఆస్వాదిస్తున్నాను. జట్టులోకి ఎలా పునరాగమనం చేయాలో తెలుసు. కేవలం క్రికెట్‌పై ఉన్న ఇష్టం, గౌరవంతోనే ఆడుతున్నాను. నేనేమి టీమిండియా తరఫున ఆడాలని ఎదురుచూడట్లేదు. ఉన్నత స్థాయి క్రికెట్ ఆడటమే లక్ష్యం. ఇక్కడ జట్లు అనేవి ప్రాధాన్యం కాదు. ఏ తరహా క్రికెట్ ఆడాల్సి వచ్చినా... న్యాయం చేయడంపైనే దృష్టి సారిస్తా" -మురళీ విజయ్, క్రికెటర్