తెలంగాణ

telangana

ETV Bharat / sports

అండర్ 19: పాక్​ను చిత్తు చేసిన భారత్​.. ఫైనల్లో ప్రవేశం - ND crash Pakistan.. Enter Into Finals

భారత్​-పాకిస్థాన్ మధ్య జరిగిన అండర్-19 ప్రపంచకప్​ సెమీఫైనల్లో టీమిండియా ఘనవిజయం సాధించింది. 10 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్లో ప్రవేశించింది.

భారత్
భారత్

By

Published : Feb 4, 2020, 7:43 PM IST

Updated : Feb 29, 2020, 4:33 AM IST

పాకిస్థాన్‌తో జరిగిన అండర్​ 19 ప్రపంచకప్‌ సెమీఫైనల్స్‌లో టీమిండియా సమష్టిగా రాణించి విజయం సాధించింది. మొదట బౌలర్లు, అనంతరం బ్యాట్స్​మెన్ పూర్తిగా పాక్​పై ఆధిపత్యం చూపగా.. భారత జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది.

173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్..​ ఏ దశలోనూ తడబడలేదు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (105) సెంచరీతో సత్తాచాటాడు. దివ్యాంశ్ సక్సేనా (59) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. వీరి ధాటికి ఒక్క వికెట్ కోల్పోకుండానే లక్ష్యాన్ని ఛేదించింది టీమిండియా.

తడబడిన పాక్

మొదట బ్యాటింగ్ చేసిన దాయాది జట్టును 172 పరుగులకే కట్టడి చేశారు భారత బౌలర్లు. సుశాంత్‌ మిశ్రా(3), కార్తిక్‌ త్యాగి(2), రవి బిష్ణోయ్‌(2) చెలరేగడం వల్ల పాక్‌ బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓపెనర్‌ హైదర్‌ అలి(56; 77బంతుల్లో 9x4), కెప్టెన్‌ రొహైల్‌ నజీర్‌ (62; 102 బంతుల్లో 6x4) మాత్రమే అర్ధ శతకాలతో మెరిశారు. మిగతా బ్యాట్స్‌మన్‌ వైఫల్యం చెందారు.

మరో సెమీస్​లో న్యూజిలాండ్-బంగ్లాదేశ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. గురువారం ఈ మ్యాచ్ జరగనుంది. ఈ పోరులో గెలిచిన జట్టుతో టీమిండియా ఫైనల్​ ఆడుతుంది.

Last Updated : Feb 29, 2020, 4:33 AM IST

ABOUT THE AUTHOR

...view details