ఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాలోని పాచెఫ్‌స్ట్రూమ్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతోన్న సెమీస్‌లో భారత బౌలర్లు సత్తాచాటారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాక్‌ను 172 పరుగులకే కట్టడి చేశారు. ఓపెనర్ హైదర్ అలీ (56)తో పాటు రొహైల్ నజీర్ (62) సత్తాచాటడం వల్ల ఈమాత్రమైన స్కోర్ చేయగలిగింది పాక్.
అండర్-19: భారత బౌలర్ల విజృంభణ.. పాక్ 172 ఆలౌట్ - Under 19 World cup: IND bowlers shines Pakistan 200/2
ఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య సెమీస్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు.. 43.1 ఓవర్లలో 172 రన్స్ చేసి ఆలౌటైంది. స్టార్ బ్యాట్స్‌మన్ హురైరా(4), ఫహద్ మునీర్(0) నిరాశపర్చాగా.. ఓపెనర్ హైదర్ అలీ(56), రొహైల్ నజీర్ (62) సత్తాచాటారు.
పాకిస్థాన్
భారత బౌలర్లలో సుశాంత్ మిశ్రా 3, రవి బిష్ణోయ్, కార్తీక్ త్యాగి 2, అథ్వర అంకోలేకర్, యశస్వి జైస్వాల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
Last Updated : Feb 29, 2020, 4:01 AM IST