తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత యువ క్రికెటర్లకు పులుల మధ్య శిక్షణ​ - Under-19 World Cup 2020: Indian team stay in tiger safari with Dravid for improve bonding

పృథ్వీషా నేతృత్వంలో గతేడాది అండర్​-19 క్రికెట్ ప్రపంచకప్​ గెలిచింది యువ భారత్. ఇప్పుడు మరోసారి ఆ ప్రతిష్టాత్మక టోర్నీకి సిద్ధమవుతోంది. ఇప్పటికే జట్టును ప్రకటించిన టీమిండియా.. ద్రవిడ్​ పర్యవేక్షణలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. క్రికెటర్ల మధ్య బంధం పెంచేందుకు ఇది ఉపయోగపడుతోందని అధికారులు చెప్పారు.

Under-19 World Cup 2020: Indian team stay in tiger safari with Dravid for improve bonding
ద్రవిడ్​ పర్యవేక్షణలో.. పులుల మధ్య యువ ఆటగాళ్లకు శిక్షణ​..!

By

Published : Dec 10, 2019, 9:25 PM IST

భారత్‌-ఏ, అండర్‌-19 కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ ఎంపికైనప్పటి నుంచి క్రికెటర్ల మధ్య బంధం బలపడే (టీమ్‌ బాండింగ్‌) కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా మారింది. వచ్చే జనవరిలో జరిగే అండర్‌-19 ప్రపంచకప్‌కు కోసం ఇటీవలే జట్టును ప్రకటించారు. వారందరూ కర్ణాటకలోని నాగర్‌హోల్‌ జాతీయ ఉద్యానవనంలో రెండు రోజులు గడపనున్నారు. ద్రవిడ్‌ నేతృత్వంలోనే ఈ కార్యక్రమం జరగనున్నట్లు బీసీసీఐ అధికారులు చెప్పారు.

కర్ణాటకలోని నాగర్‌హోల్‌ జాతీయ ఉద్యానవనం

" ఇది రెండు రోజుల టీమ్‌ బాండింగ్‌ కార్యక్రమం. బూట్‌ క్యాంప్‌ వంటిది కాదు. అండర్‌-19, భారత్​- ఏ జట్లకు క్రమం తప్పకుండా వీటిని నిర్వహిస్తుంటాం. సీనియర్‌ జట్టుకైతే సొంత షెడ్యూల్ ఉంటుంది. అండర్‌-19 క్రికెటర్లు దేశం నలుమూలల నుంచి వస్తారు. వారి మధ్య స్నేహం, నమ్మకం, బంధం, కలివిడితనం పెరిగేందుకు ఈ కార్యక్రమం బాగా ఉపయోగపడుతుంది. భిన్నమైన పరిస్థితులకు క్రికెటర్లు ఎలా స్పందిస్తారో తెలుస్తుంది. ఈ రోజు టైగర్‌ సఫారీని వారు బాగా ఆస్వాదించారు. కొన్ని చోట్ల పులులను గుర్తించారు".
--బీసీసీఐ అధికారి

సఫారీలో పులులు

వచ్చే ఏడాది దక్షిణాఫ్రికాలో జరగనున్న అండర్-19 క్రికెట్ ప్రపంచకప్​కు ప్రియమ్ గార్గ్ కెప్టెన్​గా వ్యహవరించనున్నాడు. వికెట్​కీపర్ ధ్రువ్ చంద్ జురెల్ వైస్​ కెప్టెన్​గా ఉండనున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్.. న్యూజిలాండ్, శ్రీలంకతోపాటు క్రికెట్‌లో అరంగేట్రం చేస్తున్న జపాన్‌తో కలిసి గ్రూప్-ఏలో ఉంది. ఆతిథ్య దక్షిణాప్రికా.. అఫ్గానిస్థాన్, యూఏఈ, కెనడాతో కలిసి గ్రూప్-డిలో ఉంది. జనవరి 17 నుంచి ఫిబ్రవరి 9 వరకు జరిగే ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు తలపడనున్నాయి.

భారత యువ జట్టు...

ప్రియమ్ గార్గ్ (సారథి), ధ్రువ్​చంద్ జురెల్ (వైస్ కెప్టెన్, కీపర్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, దివ్యాంశ్ సక్సేనా, శాశ్వత్ రావత్, దివ్యాంశ్ జోషి, శుభంగ్ హెగ్డే, రవి బిష్నోయ్, ఆకాశ్ సింగ్, కార్తీక్ త్యాగి, అథర్వ అంకోలేకర్, కుమార్ కుశాగ్ర (కీపర్), సుశాంత్ మిశ్రా, విద్యాధర్ పాటిల్.

ఇవీ చూడండి...

ABOUT THE AUTHOR

...view details