తెలంగాణ

telangana

ETV Bharat / sports

అండర్​ 19: 'కంగారు' పెట్టిస్తోన్న భారత​ బౌలర్లు

దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతోన్న అండర్​-19 ప్రపంచకప్​లో యువ భారత్​ అత్యుత్తమ ఆటతీరు కనబరుస్తోంది. బలమైన ప్రత్యర్థిగా బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను.. టీమిండియా ఆటగాళ్లు బౌలింగ్​తో బెంబేలెత్తిస్తున్నారు. 234 పరుగుల లక్ష్య ఛేదనలో 17 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది కంగారూ జట్టు.

Under 19 Quarters: India U19 vs Australia U19, Super League Quarter-Final 1
అండర్​ 19 ప్రపంచకప్​: ఆస్ట్రేలియాను బెంబేలెత్తిస్తున్న త్యాగీ

By

Published : Jan 28, 2020, 6:17 PM IST

Updated : Feb 28, 2020, 7:34 AM IST

అండర్​-19 ప్రపంచకప్​లో డిఫెండింగ్​ ఛాంపియన్​, ఫేవరేట్లలో ఒకటైన భారత్​.. మరోసారి సత్తా చాటుతోంది.​ నాకౌట్​ పోరులో ఆస్ట్రేలియా బ్యాట్స్​మన్​ను​ వణికిస్తోంది.

త్యాగి అత్యుత్తమంగా...

తొలుత బ్యాటింగ్​ చేసిన యువ టీమిండియా 9 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను ఆరంభంలోనే దెబ్బతీశాడు పేసర్​ కార్తీక్​ త్యాగి. కంగారూ జట్టు పరుగుల ఖాతా తెరవక ముందే వికెట్​ పడగొట్టి పతనం ప్రారంభించారు భారత బౌలర్లు. తొలి బంతికే ఆసీస్​ ఓపెనర్​ గ్రుక్​ను రనౌట్​గా పంపించారు. అదే ఓవర్​ నాలుగో బంతికి హార్వేను ఎల్బీగా ఔట్​ చేసిన త్యాగి.. తర్వాతి బంతికి మరో బ్యాట్స్​మన్​ హెర్నేను బౌల్డ్​ చేశాడు.

ఆ తర్వాత మూడో ఓవర్​లో మళ్లీ బంతి అందుకున్న ఈ యువ ఫాస్ట్​ బౌలర్​.. మరో బ్యాట్స్​మన్​ ఒలీవర్​ను పెవిలియన్​ చేర్చాడు. ఫలితంగా 17 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా జట్టు.

మొదట బ్యాటింగ్​ చేసిన యువ భారత్​ బ్యాట్స్​మన్​లో యశస్వి(62), అథర్వ(55) అర్ధ శతకాలతో రాణించారు.

ఇదీ చూడండి...

అండర్​-19: జైస్వాల్, అథర్వ అదరహో.. ఆసీస్ లక్ష్యం 234

Last Updated : Feb 28, 2020, 7:34 AM IST

ABOUT THE AUTHOR

...view details