తెలంగాణ

telangana

ETV Bharat / sports

'సిడ్నీ టెస్టును మధ్యలోనే ఆపేయమన్నారు' - racial abuse from crowd

ఆస్ట్రేలియా సిడ్నీ గ్రౌండ్​లో జరిగిన జాతి వివక్ష ఉదంతాన్ని మరోమారు ప్రస్తావించాడు టీమ్ఇం​డియా బౌలర్​ మహమ్మద్​ సిరాజ్. ఆటను మధ్యలో వదిలేసే అవకాశం తమ జట్టుకు వచ్చిందని తెలిపాడు. అంపైర్లు ఈ అవకాశాన్ని ఇచ్చారన్నాడు.

Umpires offered us option to leave Sydney Test midway after racial abuse from crowd, reveals Siraj
'అంపైర్లు.. ఆటను మధ్యలో ఆపేయమన్నారు'

By

Published : Jan 21, 2021, 7:13 PM IST

సిడ్నీ టెస్టులో జాతి వివక్ష వ్యాఖ్యలు ఎదుర్కొన్న టీమ్​ఇండియా బౌలర్​ మహమ్మద్​ సిరాజ్​.. తాజాగా ఆ విషయంపై స్పందించాడు. స్వదేశానికి వచ్చిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పలు అంశాలు వెల్లడించాడు. ఆన్​-ఫీల్డ్​ అంపైర్లు.. ఆటను మధ్యలో వదిలేసే అవకాశాన్ని తమ జట్టుకు ఇచ్చారని తెలిపాడు.

ఆస్ట్రేలియాలో జాతి వివక్ష వ్యాఖ్యలు ఎదుర్కొన్నాను. నాకు న్యాయం చేకూరిందా.. లేదా.. అన్నది పక్కన పెడితే, కేసు విచారణలో ఉంది. సంఘటనపై కెప్టెన్​కు ఫిర్యాదు చేసే బాధ్యత నాది. ఆ తర్వాత.. అంపైర్లు ఆటను మధ్యలో వదిలేసే అవకాశాన్ని మా జట్టుకు ఇచ్చారు. కానీ,​ అందుకు మా కెప్టెన్ అంగీకరించలేదు. మేము ఏ తప్పు చేయలేదు. ఆటను కొనసాగిస్తామని రహానే చెప్పాడు.

-మహమ్మద్​ సిరాజ్​, బౌలర్​.

అయితే ఆస్ట్రేలియన్లు చేసిన వ్యాఖ్యలు తనను మానసికంగా దృఢంగా చేశాయే తప్ప.. తన ఆటపై ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాయని సిరాజ్​ తెలిపాడు.

సిరాజ్, సీనియర్​ బౌలర్​ జస్ప్రీత్​ బుమ్రా.. సిడ్నీ గ్రౌండ్​లో ప్రేక్షకుల నుంచి రెండుసార్లు జాతి వివక్ష వ్యాఖ్యలు ఎదుర్కొన్నారు. కొంతమంది ప్రేక్షకులు.. సిరాజ్​ను 'బ్రౌన్​ మంకీ' అని గేలి చేశారు. ఈ విషయంపై కెప్టెన్​ రహానే.. ఫీల్డ్​ అంపైర్లు పాల్​ రిఫెల్​, పాల్​ విల్సన్​లకు విషయాన్ని తెలిపాడు. అదే విధంగా జట్టు యాజమాన్యం మ్యాచ్​ రిఫరీ డేవిడ్​ బూన్​కు ఫిర్యాదు చేయగా.. సంఘటనపై క్రికెట్​ ఆస్ట్రేలియా క్షమాపణలు చెప్పింది.

వ్యాఖ్యలు చేసిన ఆరుగురిని గుర్తించిన ఆస్ట్రేలియా యాజమాన్యం.. వారికి తగిన శిక్ష పడేలా ప్రయత్నిస్తామని తెలిపింది.

కాగా, అరంగ్రేట సిరీస్​లో సిరాజ్​ విశేషంగా ఆకట్టుకున్నాడు. 13 వికెట్లు తీసి జట్టు చరిత్రాత్మక టెస్ట్​ సిరీస్​ విజయాన్ని నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

ఇదీ చదవండి:సిరీస్‌లో తీసిన ప్రతి వికెట్‌ నాన్నకు అంకితం: సిరాజ్‌

ABOUT THE AUTHOR

...view details