తెలంగాణ

telangana

ETV Bharat / sports

వైరల్: రషీద్ అప్పీల్​.. అంపైర్​ ఫన్నీ కౌంటర్​! - Rashid Funny appeal

బిగ్​బాష్​ లీగ్​లో మెల్​బోర్న్- అడిలైడ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్​లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రషీద్​ ఖాన్​ చేసిన అప్పీల్​కు అంపైర్ గ్రెగ్ డేవిడ్సన్ ఔటివ్వబోయి ప్రవర్తించిన తీరుకు మైదానంలో అందరి ముఖంలో నవ్వులు విరిశాయి.

Umpire's Funny Gesture On Rashid Khan's LBW Appeal Leaves Everyone In Splits
అంపైర్ గ్రెగ్ డేవిడ్సన్​- రషీద్ ఖాన్

By

Published : Dec 30, 2019, 7:01 AM IST

బిగ్​బాష్​ లీగ్​లో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. అంపైర్ గ్రెగ్ డేవిడ్సన్ అప్పీల్​కు స్పందించిన తీరు స్టేడియంలో నవ్వులు పూయించింది. మెల్​బోర్న్ రెనెగేడ్స్​తో జరిగిన మ్యాచ్​లో అడిలైడ్ స్ట్రైకర్స్ బౌలర్​ రషీద్ ఖాన్ అప్పీల్ చేయగా.. అంపైర్​ గ్రెగ్​ ఔటిచ్చినట్లు సంకేతమివ్వబోయి ముక్కును తుడుచుకుంటున్నట్లు ప్రవర్తించిన తీరుకు నవ్వులు పూశాయి.

ఈ మ్యాచ్​ 17 ఓవర్లో రషీద్ ఖాన్​ బంతి వేయగా.. మెల్​బోర్న్ బ్యాట్స్​మన్ బెవూ వెబస్టర్​ ప్యాడ్​కు తగిలింది. రషీద్ ఎల్బీడబ్ల్యూ అప్పీల్​ చేశాడు. అయితే మొదట ఔటనుకొని అంపైర్ గ్రెగ్​ వేలు పైకెత్తుతూ.. ఔటివ్వబోయాడు. అయితే మళ్లీ తన మనసు మార్చుకొని ముక్కును తుడుచుకుంటున్నట్లు కవర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

ఈ మ్యాచ్​లో ఆల్​రౌండర్​ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు అడిలైడ్​ స్ట్రైకర్స్​​ క్రికెటర్​ రషీద్​ఖాన్​. బ్యాట్స్​మన్​గా 25 పరుగులతో( 16 బంతుల్లో; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. రషీద్​తో పాటు ఫిలిఫ్​ సాల్ట్ ​(54), అలెక్స్​ కేరీ (41) చక్కటి ప్రదర్శనతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది అడిలైడ్​ స్ట్రైకర్స్​​ జట్టు.

అనంతరం లక్ష్య ఛేదనలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులే చేయగలిగింది మెల్​బోర్న్​ రెనెగేడ్స్​ జట్టు. ఆరోన్​ ఫించ్​ (50), వెబ్​స్టర్ ​(37) మాత్రమే రాణించారు. బౌలింగ్​లో రషీద్​, వెస్​ అగర్​, క్యామరాన్​ చెరో రెండేసి వికెట్లు తీసుకున్నారు. ఫలితంగా అడిలైడ్​ స్ట్రైకర్స్​​ జట్టు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఇదీ చదవండి: ఆసీస్​ క్రికెటర్ పీటర్ సిడిల్ రిటైర్మెంట్​

ABOUT THE AUTHOR

...view details