తెలంగాణ

telangana

ETV Bharat / sports

'విరాట్​ కోహ్లీ క్రికెటర్ కాదు మోడల్​'

టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ... సచిన్ తర్వాత భారత్​కు లభించిన అద్భుత బ్యాట్స్​మన్ అని చెప్పాడు మాజీ అంపైర్​ ఇయాన్​ గౌల్డ్.​ అతడ్ని చూస్తే మోడల్ అని అనుకుంటారని తెలిపాడు.

By

Published : May 31, 2020, 2:35 PM IST

Umpire Ian Gould praises Virat Kohli's fitness levels, says he looks like a model
విరాట్​ కోహ్లీ ఓ మోడల్​లా ఉంటాడు: అంపైర్​ గౌల్డ్​

టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీపై మాజీ అంపైర్​ ఇయాన్​ గౌల్డ్​ ప్రశంసలు కురిపించాడు. ఈ డాషింగ్​ బ్యాట్స్​మన్​ ఓ మోడల్​ను పోలి ఉంటాడని అభిప్రాయపడ్డాడు. అతడిలో గొప్ప క్రికెటర్​ దాగున్నాడని.. క్రికెట్​ గురించి ఎన్ని గంటలైనా మాట్లాడగలడని అన్నాడు.

"కోహ్లీ చాలా సరదాగా ఉండే వ్యక్తి. అతడు నాలాగే రెండు సార్లు బ్యాటింగ్​ చేశాడు. ఈ విషయం గురించి అతడికి చాలాసార్లు చెప్పాను. సచిన్​ తర్వాత భారత్​కు దక్కిన ఓ అద్భుతమైన ఆటగాడు కోహ్లీ. దేశం మొత్తం తన వెనకుందనేది మీకు తెలియని విషయం. కోహ్లీ అంకితభావం గల కుర్రాడు. ఎవరైనా అతడ్ని చూస్తే మోడల్​ అని అనుకుంటారు. కానీ ఎప్పడూ క్రికెట్​ గురించే ఆలోచించే అందమైన వ్యక్తి విరాట్"

- ఇయాన్​ గౌల్డ్​, ప్రముఖ అంపైర్

విరాట్​ కోహ్లీపై స్పందించిన అంపైర్​ ఇయాన్​ గౌల్డ్​

మైదానంలో అంపైర్ల నిర్ణయంతో ఏకీభవించనప్పుడు కోహ్లీ కొన్నిసార్లు వాగ్వాదాలకు దిగేవాడని, కొన్నేళ్ల నుంచి మాత్రం గౌరవప్రదంగా ఉండటం నేర్చుకున్నాడని గౌల్డ్​ చెప్పాడు. ​

ఇయాన్​ గౌల్డ్​.. తన 13 ఏళ్ల కెరీర్​లో 250కి పైగా అంతర్జాతీయ మ్యాచ్​లకు అంపైర్​గా వ్యవహరించాడు. 2019లో ఐసీసీకి చెందిన ఎలైట్​ అంపైర్ల ప్యానెల్​ నుంచి రిటైర్​ అయ్యాడు.

ఇదీ చూడండి... ఒలింపిక్స్ వాయిదాతో నిరాశపడ్డ స్టార్ షూటర్ మను​

ABOUT THE AUTHOR

...view details