సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్ ఇంగ్లాండ్‌తో అహ్మదాబాద్‌లో ఫిబ్రవరి 24న ఆరంభమయ్యే డేనైట్ టెస్టులో ఆడతాడో లేదో రెండు రోజుల్లో తేలిపోనుంది. అతనికి ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహించబోతున్నారు. ఈ పరీక్షలో సఫలమైతే అతను బుమ్రా, ఇషాంత్ కలిసి గులాబి బంతి పంచుకునే అవకాశాలున్నాయి. చెన్నైలో మాదిరే అహ్మదాబాద్ పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉండాలని టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది.
భారత పేసర్ ఉమేశ్ యాదవ్‌కు ఫిట్‌నెస్ టెస్ట్
టీమ్ఇండియా పేసర్ ఉమేశ్ యాదవ్‌కు మరో రెండు రోజుల్లో ఫిట్‌నెస్ పరీక్షను నిర్వహించనున్నారు. ఇందులో సఫలమైతే ఇంగ్లాండ్‌తో జరగనున్న పింక్-బాల్ టెస్టు ఆడేందుకు ఉమేశ్‌కు అవకాశం లభించనుంది.
అలా అయితే స్పిన్నర్లు అశ్విన్, అక్షర్ పటేల్ పరిస్థితులను సద్వినియోగం చేసుకునే వీలుంటుందని భావిస్తోంది. ఫ్లడ్ లైట్ల వెలుతురులో గులాబి బంతి స్వింగ్ అయ్యే నేపథ్యంలో కుల్‌దీప్ యాదవ్‌ను పక్కనపెట్టి ఒక పేసర్‌ను అదనంగా చేర్చుకునే అవకాశాలున్నాయి. బుమ్రా, ఇషాంత్‌తో పాటు మూడో పేసర్ స్థానానికి ఉమేశ్, సిరాజ్ మధ్య పోటీ నెలకొనే అవకాశాలున్నాయి. ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో గాయపడిన ఉమేశ్ అప్పటి నుంచి మైదానానికి దూరమయ్యాడు.
ఇదీ చూడండి:'పేసర్లకు బంతి అనుకూలిస్తే విజయం మాదే'