తెలంగాణ

telangana

ETV Bharat / sports

నాలుగో టెస్టు కోసం బుమ్రా స్థానంలో ఉమేశ్! - క్రికెట్ న్యూస్

సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్.. ఇంగ్లాండ్​తో చివరి టెస్టు కోసం జట్టులోకి వచ్చారు. బుమ్రా స్థానంలో అతడు బరిలోకి దిగే అవకాశముంది.

Umesh Yadav likely to replace Jasprit Bumrah in 4th Test
నాలుగో టెస్టు కోసం బుమ్రా స్థానంలో ఉమేశ్!

By

Published : Mar 3, 2021, 9:25 AM IST

ఇంగ్లాండ్​తో నాలుగో టెస్టుకు బుమ్రాకు విశ్రాంతినిచ్చినట్లు ఇటీవల టీమ్​ఇండియా వెల్లడించింది. ఇప్పుడు అతడి స్థానంలో ఉమేశ్​ యాదవ్​కు చోటు లభించే అవకాశం కనిపిస్తోంది. మ్యాచ్​ జరిగే మొతేరా పిచ్​ స్పిన్నర్లకు అనుకూలమైనప్పటికీ, అనువజ్ఞుడైన పేసర్ కూడా​ జట్టులో ఉండాలని మేనేజ్​మెంట్ భావిస్తోంది.

డిసెంబరు-జనవరిలో జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలోని రెండు టెస్టులో గాయపడ్డ ఉమేశ్.. ఇటీవల తిరిగి కోలుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్​తో చివరి టెస్టు కోసం అతడిని తుది జట్టులోకి తీసుకోవడం దాదాపు ఖాయమే!

భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా

ఉమేశ్, నెట్స్​లో బాగా బౌలింగ్ చేస్తున్నాడని తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో వైస్ కెప్టెన్ రహానె చెప్పాడు.. అతడు తిరిగి జట్టులోకి రావడం ఆనందంగా ఉందని అన్నాడు. ఇప్పటివరకు భారత్​ తరఫున 28 టెస్టులాడిన ఉమేశ్.. 148 వికెట్లు తీశాడు. అందులో 96 సొంతగడ్డపై తీసినవే కావడం విశేషం.

ఇది చదవండి:గురువారం నుంచే చివరి టెస్టు.. దృష్టంతా పిచ్​ పైనే!

ABOUT THE AUTHOR

...view details