టీమ్ఇండియా పేసర్ ఉమేశ్ యాదవ్, తాన్యా దంపతులకు శుక్రవారం(జనవరి 1) ఆడపిల్ల పుట్టింది. ఈ విషయాన్ని బీసీసీఐ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. తమ కుటుంబంలోకి లిటిల్ ప్రిన్సెస్ వచ్చినందుకు ఆనందంగా ఉందని ఉమేశ్ కూడా ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టాడు.
తండ్రి అయిన బౌలర్ ఉమేశ్ యాదవ్ - ఉమేశ్ యాదవ్ వార్తలు
ఆసీస్ పర్యటనలో ఉన్న ఉమేశ్ యాదవ్ నాన్నగా ప్రమోషన్ పొందాడు. శుక్రవారం ప్రసవించిన అతడి భార్య.. ఆడపిల్లకు జన్మనిచ్చింది.
తండ్రి అయిన బౌలర్ ఉమేశ్ యాదవ్
ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఉమేశ్.. గాయం కారణంగా చివరి రెండు టెస్టులకు దూరమయ్యాడు. ఇతడి స్థానంలో నటరాజన్‌ను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది భారత క్రికెట్ బోర్డు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన కూడా చేసింది.
ఇదీ చదవండి:ఆస్ట్రేలియాతో టెస్టులకు నటరాజన్ ఎంపిక