పాకిస్థాన్ పేస్ బౌలర్ ఉమర్ గుల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 36ఏళ్ల గుల్ అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు.
"నా క్రికెట్ ప్రయాణాన్ని ఎంతో ఆస్వాదించాను. నా దేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు ఎంతో గర్వపడుతున్నాను. కృషి, సంకల్పం, నిబద్ధత, గౌరవ విలువలను నేను క్రికెట్ నుంచే నేర్చుకున్నాను. ఈ ప్రయాణంలో నాకు మద్దతు ఇచ్చి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇన్నేళ్ల నా క్రికెట్ ప్రయాణంలో వాళ్లే నాకు స్పూర్తి. వాళ్లు నాకోసం ఎంతో త్యాగం చేశారు. ఇక నుంచి నేను వాళ్లను మిస్ అవుతాను."