అవినీతి ఆరోపణలతో ఉమర్ అక్మల్‌పై గతంలో మూడేళ్ల నిషేధాన్ని విధించింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ). అయితే దానికి సంబంధించిన ఆధారాలను సేకరించడంలో బోర్డు విఫలమవ్వడం వల్ల లుసానేలోని కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్)ను ఆశ్రయించాడు అక్మల్. తనపై ఉన్న 18 నెలల నిషేధాన్ని రద్దు చేయాలని కోరుతూ న్యాయస్థానంలో అభ్యర్థన దాఖలు చేశాడు. ఉమర్‌కు వ్యతిరేకంగా ఎలాంటి రుజువులు లేకపోవడం వల్ల నిషేధాన్ని రద్దు చేయాలని క్రికెటర్ తరపు న్యాయవాది వాదించారు.
"ఉమర్ అక్మల్‌కు వ్యతిరేకంగా వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. విచారణ మొత్తం ఫోన్లోనే జరిగింది. వారు చేస్తున్న ఆరోపణలను రుజువు చేయడానికి కనీసం బ్యాంకు లావాదేవీలు కూడా లేవు."