తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్: 2000 టెస్ట్​లు చేస్తే ఇద్దరు క్రికెటర్లకే కరోనా - csk corona

ఐపీఎల్​లో పాల్గొనే వారికి చేసిన కరోనా పరీక్షల్లో 13 మందికి పాజిటివ్​ రాగా, అందులో ఇద్దరు మాత్రమే క్రికెటర్లు ఉన్నారని బీసీసీఐ తెలిపింది.

ఐపీఎల్: 2000 టెస్ట్​లు చేస్తే ఇద్దరు క్రికెటర్లకే కరోనా
చెన్నై సూపర్​కింగ్స్

By

Published : Aug 29, 2020, 4:08 PM IST

ఐపీఎల్​లో పాల్గొనున్న క్రికెటర్లకు కరోనా రావడంపై స్పందించిన బీసీసీఐ.. ఓ ప్రకటన విడుదల చేసింది. మొత్తంగా 1,988 సార్లు కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 13 మందికి పాజిటివ్​ వచ్చినట్లు వెల్లడించింది. అందులో ఇద్దరు క్రికెటర్లు ఉన్నట్లు చెప్పినా, వారి పేర్లు మాత్రం వెల్లడించలేదు. ఆ ఇద్దరూ ఆటగాళ్లు చెన్నై సూపర్​కింగ్స్​కు చెందిన దీపక్ చాహర్, రుతురాజ్ గైక్వాడ్ అని సమాచారం.

"13 మంది సిబ్బందికి కరోనా ఉన్నట్లు తేలింది. అందులో ఇద్దరు ప్లేయర్స్ కూడా ఉన్నారు. ఈ వ్యక్తులతో పాటు వారికి కాంటాక్ట్​లో ఉన్న వాళ్లు స్వీయ నిర్బంధంలోకి వెళ్లనున్నారు. వారందరినీ ఐపీఎల్ వైద్యబృందం పర్యవేక్షించనుంది" -బీసీసీఐ ప్రకటన

ఐపీఎల్ 2020

క్రికెటర్లు, సహాయ సిబ్బంది, జట్టు మేనేజ్​మెంట్​, బీసీసీఐ సిబ్బంది, ఐపీఎల్ ఆపరేషనల్ టీమ్, హోటల్, మైదాన సిబ్బంది.. కరోనా టెస్ట్​లు చేసిన వారిలో ఉన్నారు. ఐపీఎల్-2020 ఆరోగ్య నిబంధనల ప్రకారం.. టోర్నీ ఆసాంతం ప్రతిఐదురోజులకు ఓసారి వీళ్లకు వైద్యపరీక్షలు చేస్తూనే ఉంటారు. ఒకవేళ ఎవరైనా సరే పాజిటివ్​గా తేలితే 14 రోజుల క్వారంటైన్​ సహా రెండుసార్లు పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అందులో నెగటివ్​గా తేలితేనే బయోబబుల్​లోకి అనుమితిస్తారు.

యూఏఈ క్రికెట్ స్టేడియం

ABOUT THE AUTHOR

...view details