భారత్-పాకిస్థాన్ మధ్య 1999లో జరిగిన కార్గిల్ యుద్ధ సమయంలో.. భారీ కాంట్రాక్ట్ వదులుకున్నట్లు వెల్లడించాడు పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్. నాటింగ్‌హామ్‌షైర్ తరఫున ఆడేందుకు చేసుకున్న రూ.1.71 కోట్ల ఒప్పందాన్ని రద్దు చేసుకొని.. యుద్ధంలో పాల్గొనేందుకు ప్రయత్నించినట్లు తెలిపాడు. ఆ సమయంలో దేశం కోసం ప్రాణాలర్పించేందుకు సిద్ధమైనట్లు స్పష్టం చేశాడు.
" నేను లాహోర్ సరిహద్దుల్లో ఉన్నాను. ఓ ఆర్మీ జనరల్ వచ్చి నువ్విక్కడ ఏం చేస్తున్నావ్? అని అడిగారు. మనిద్దరం కలిసి చనిపోబోతున్నాం అని అతనికి చెప్పా. యుద్ధం సమయంలో రెండుసార్లు క్రికెట్‌ను వదిలేశాను. నాటింగ్హామ్తో రూ.1.71 కోట్ల కాంట్రాక్ట్ సహా మరో పెద్ద ఆఫర్‌ను కార్గిల్ సమయంలో వదులుకున్నా. అప్పుడు ఆయా కౌంటీలు షాక్ అయ్యాయి"
-- షోయబ్ అక్తర్, పాక్ మాజీ క్రికెటర్.