వెల్లింగ్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టీ 20 మ్యాచ్లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది రోహిత్ సేన. ఈ మ్యాచ్లో భారత్ ముగ్గురు కీపర్లతో బరిలోకి దిగనుండటం విశేషం. కుల్దీప్ స్థానంలో యుజువేంద్ర చాహల్ ఆడుతున్నాడు. పాండ్య సోదరులిద్దరూ తుది జట్టులో ఉన్నారు. భువనేశ్వర్, ఖలీల్ అహ్మద్, హార్దిక్ పాండ్యాలతో భారత పేస్ దళం బలంగా ఉంది. కివీస్ స్టార్ ఓపెనర్ గప్తిల్ గాయంతో మ్యాచ్కు దూరమయ్యాడు.
ఈ మ్యాచ్ గెలిస్తే న్యూజిలాండ్ గడ్డపై తొలి టీ-20 విజయం నమోదు చేసిన కెప్టెన్గా రికార్డుకెక్కుతాడు రోహిత్ శర్మ. 2008-09లో ధోని సారథ్యంలో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన భారత్ 0-2తో సిరీస్ ఓటమిని చవిచూసింది.