తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఎంపిక​ కమిటీపై పాక్​ క్రికెటర్ జునైద్​ నిరసన.. - పాక్‌ బౌలర్‌ జునైద్‌ ఖాన్‌

ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో పేలవ ప్రదర్శన చేసిన ఆటగాళ్లను ప్రపంచకప్​ జట్టు నుంచి తప్పించింది పాక్​ క్రికెట్​ బోర్డు. వరల్డ్‌కప్‌ జట్టు నుంచి తప్పించడంపై పాక్‌ బౌలర్‌ జునైద్‌ ఖాన్‌ సెలక్టర్లపై వినూత్నంగా నిరసన తెలిపాడు.

ప్రపంచకప్​ నుంచి తప్పించినందుకు పాక్​ క్రికెటర్​ నిరసన

By

Published : May 22, 2019, 12:08 AM IST

పాకిస్థాన్‌ ప్రపంచకప్‌ జట్టు నుంచి ముగ్గురు ఆటగాళ్లకు ఉద్వాసన ఎదురైన పరిస్థితి తెలిసిందే. చీఫ్‌ సెలక్టర్‌ ఇంజమామ్​ ఉల్‌ హక్‌ మెగా టోర్నీకి పాక్‌ తుది 15 మందితో కూడిన జట్టునుసోమవారంప్రకటించాడు. అందులో ఆకట్టుకోలేకపోయిన పేస్‌ ఆల్‌రౌండర్‌ ఫహీమ్‌ అష్రఫ్‌, పేసర్‌ జునైద్‌ ఖాన్‌తో పాటు అబిద్‌ అలీని సెలక్షన్‌ కమిటీ తొలగించింది.

మెగాటోర్నీలో పాల్గొనే జట్టు నుంచి తప్పించడంతో పాక్‌ బౌలర్‌ జునైద్‌ ఖాన్‌ సెలక్టర్లపై నిరసన తెలిపాడు.

" ప్రస్తుతం నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది"
-- జునైద్​ ఖాన్​, పాకిస్థాన్​ క్రికెటర్​

జునైద్‌ ఖాన్‌ ట్వీట్​

నోటికి నల్లప్లాస్టర్‌ వేసుకున్న ఫొటోను ట్వీట్‌కు జత చేసి పోస్టు చేశాడు. 29 ఏళ్ల జునైద్‌ తొలుత పాక్‌ ప్రిలిమినరీ జట్టులో ఎంపికయ్యాడు.

ABOUT THE AUTHOR

...view details