న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌కు ఆడనున్నాడు. ఈ విషయాన్ని ఈ ఫ్రాంఛైజీ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఈ మేరకు దిల్లీ క్యాపిటల్స్‌తో ట్రేడింగ్ విండో ద్వారా ఒప్పందం చేసుకుంది.
ఐపీఎల్: ముంబయికి బౌల్ట్.. రాజస్థాన్‌కు అంకిత్ - ankit rajput play for rajastan royals
న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ వచ్చే ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ విషయాన్ని ముంబయి జట్టు అధికారికంగా ప్రకటించింది.
ఐపీఎల్
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు అంకిత్ రాజ్‌పుత్ రాజస్థాన్ రాయల్స్‌కు బదిలీ అయ్యాడు. ఐపీఎల్-2020 సీజన్‌కు సంబంధించి ట్రేడింగ్ విండో గడువు రేపటికి(నవంబర్ 14)ముగుస్తుండటం వల్ల ఫ్రాంఛైజీలు ఆటగాళ్ల మార్పుల కోసం ప్రయత్నిస్తున్నాయి. ట్రేడింగ్ ముగిసిన అనంతరం ఐపీఎల్ వేలం డిసెంబర్19న కోల్‌కతాలో జరగనుంది.
ఇవీ చూడండి.. స్మృతి మంధాన.. ప్రేమలో ఉందా..!