ఐపీఎల్ కోసం ముంబయి ఇండియన్స్ జట్టు తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రాక్టీసులో ఆటగాళ్ల వీడియోలను సోషల్‌మీడియాలో పంచుకుంటూ.. అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది ఆ జట్టు యాజమాన్యం. ఈ ఏడాది జట్టులోకి కొత్తగా ఎంపికైన ట్రెంట్ బౌల్ట్ విధ్వంసకర బౌలింగ్ వీడియోను సోషల్‌మీడియాలో షేర్ చేసింది.
అందులో బౌల్ట్ వేసిన బంతి తాకి వికెట్ రెండు ముక్కలుగా విరిగి పోయింది. ఈ వీడియోకు 'క్లీన్ బౌల్ట్!' అనే క్యాప్షన్‌తో షేర్ చేసింది ముంబయి ఇండియన్స్.
బౌలింగ్ లైనప్ ధృఢంగా..
గతేడాది దిల్లీ క్యాపిటల్స్ తరఫున ప్రాతినిధ్యం వహించిన ట్రెంట్ బౌల్ట్.. 13వ సీజన్ వేలంలో అతడిని ముంబయి ఇండియన్స్ జట్టు సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో ముంబయి ఇండియన్స్ జట్టు బౌలింగ్ లైనప్ ఇప్పటి వరకూ చాలా ధృఢంగా ఉంది. ఇందులో అనేక మంది ప్రపంచస్థాయి బౌలర్స్ పాలుపంచుకోగా.. శ్రీలంకకు చెందిన లసిత్ మలింగ అత్యంత విజయవంతమైన బౌలర్‌గా పేరొందాడు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ప్రస్తుత ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు ఇటీవలే ప్రకటించాడు మలింగ.
యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. టోర్నీలోని తొలి మ్యాచ్‌లో.. గతేడాది ఫైనల్‌కు చేరిన ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్ తలపడనున్నాయి. ముంబయి ఖాతాలో ఇప్పటివరకు నాలుగు ఐపీఎల్ ట్రోఫీలు ఉండగా.. సీఎస్కే మూడు ఐపీఎల్ కప్‌లను గెలుపొందింది.