తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కప్పు కొట్టే అవకాశం ఆ 2 జట్లకే ఎక్కువ' - వరల్డ్ కప్ 2019

ప్రస్తుత ప్రపంచకప్​లో ఆతిథ్య ఇంగ్లాండ్​, టీమిండియాకు విజేతగా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్  పీటర్సన్. ఆస్ట్రేలియా, వెస్టిండీస్​లను తక్కువ అంచనా వేయలేమని తెలిపాడు.

'కప్పు కొట్టే అవకాశం ఆ రెండు జట్లకే ఎక్కువ'ని అంటున్న కెవిన్ పీటర్సన్

By

Published : May 30, 2019, 6:29 PM IST

ఇయాన్ మోర్గాన్ నేతృత్వంలో ఇంగ్లాండ్, కోహ్లీ సారథ్యంలోని టీమిండియా ప్రపంచకప్​లో ఫేవరెట్లని ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, అంచనాల్లేని వెస్టిండీస్​ కప్పు గెలిచే అవకాశముందని పేర్కొన్నాడు.

"ప్రస్తుత ప్రపంచకప్​లో ఇంగ్లాండ్​, భారత్​ జట్లు ఫేవరెట్లు. మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా, అంచనాల్లేని వెస్టిండీస్​ను తక్కువగా చూడలేం" -కెవిన్ పీటర్సన్, ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు

గతంలో మోర్గాన్ నాయకత్వంలో ఇంగ్లాండ్​ జట్టుకు పీటర్సన్ ఆడాడు. ప్రస్తుతం ఇంగ్లీష్ జట్టు కెప్టెన్​గా మోర్గానే ఉన్నాడు. అతడు జట్టును ముందుండి నడిపిస్తున్న తీరుపై ప్రశంసలు కురిపించాడు కెవిన్.

కెవిన్ పీటర్సన్, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్

"ఇయాన్ మోర్గాన్.. ఆటగాళ్ల ధృక్పథంలో మార్పు తీసుకువచ్చాడు. నేనేమీ ఆశ్చర్యపోవడం లేదు. అతడి గురించి నాకు తెలుసు. ప్రస్తుతం ఇంగ్లీష్ క్రికెటర్స్ బాగా ఆడుతున్నారు. నాకెంతో ఆనందంగా ఉంది." -కెవిన్ పీటర్సన్, ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు

గురువారం ఓవల్ వేదికగా ఇంగ్లాండ్​-దక్షిణాఫ్రికా మ్యాచ్​తో ప్రపంచకప్​ ఆరంభమైంది.

ఇది చదవండి: WC19: భారత కెప్టెన్​ విరాట్​ కోహ్లీకి అరుదైన గౌరవం... లార్డ్స్​ మైదానంలో కోహ్లీ మైనపు ప్రతిమ

ABOUT THE AUTHOR

...view details