ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమ్ఇండియా ఆటగాళ్లకు కరోనా నిర్ధరణ పరీక్షల్లో నెగటివ్‌గా తేలింది. దీంతో శిక్షణా శిబిరాన్ని ప్రారంభించారు. సిడ్నీ ఒలింపిక్ పార్క్‌లో ప్రాక్టీసు చేయగా, ఆ ఫొటోల్ని బీసీసీఐ ట్వీట్ చేసింది.
స్పిన్నర్ హార్దిక్ పాండ్య, మహ్మద్ సిరాజ్, పృథ్వీ షా, కుల్దీప్ యూదవ్, పేసర్ ఉమేశ్ యాదవ్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, చేతేశ్వర్ పూజారా, టి. నటరాజన్, దీపక్ చాహర్ తదితరులు జిమ్‌లో కసరత్తులు చేస్తూ కనిపించారు.