తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కోహ్లీ, బాబర్​లలో ఒకరిని ఎంపిక చేయడం కష్టం' - విరాట్ కోహ్లీ గురించి అదిల్ రషీద్

ఇంగ్లాండ్ స్పిన్నర్ అదిల్ రషీద్​ తన ప్రపంచ ఎలెవన్​ను ప్రకటించాడు. ఇందులో టీమ్​ఇండియా నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు చోటు దక్కింది.

కోహ్లీ
కోహ్లీ

By

Published : May 15, 2020, 12:07 PM IST

ఇంగ్లాండ్ స్పిన్నర్ అదిల్ రషీద్​ ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లతో వరల్డ్​ ఎలెవన్​ను ప్రకటించాడు. ఇందులో టీమ్​ఇండియా నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు చోటు లభించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోహ్లీ, బాబర్ అజామ్​ల నుంచి ఎవరో ఒకరిని తీసుకోవడం చాలా కష్టమని అభిప్రాయపడ్డాడు.

"కోహ్లీ, బాబర్​లలో ఒకరిని ఎంచుకోవడం చాలా కష్టం. ప్రస్తుతమున్న ఫామ్ ప్రకారం బాబర్​కే చోటివ్వాలి. కానీ కోహ్లీ, అజామ్ ఇద్దరూ అత్యుత్తమ ఆటగాళ్లు. అందుకే ఇద్దరినీ ఎంపిక చేశా."

-రషీద్, ఇంగ్లాండ్​ క్రికెటర్

కరోనా ప్రభావం మొదలవ్వక ముందు పరిస్థితులు చూసుకుంటే కోహ్లీ ఫామ్ ఏమాత్రం బాగా లేదు. న్యూజిలాండ్​తో జరిగిన సిరీస్​లో మొత్తం 11 ఇన్నింగ్స్​ల్లో కేవలం 218 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో రెండు టెస్టుల్లో కలిపి కేవలం 38 పరుగులు సాధించాడు. పాకిస్థాన్ యువ క్రికెటర్ బాబర్ అజామ్​ పాకిస్థాన్ సూపర్​ లీగ్​లో 49.29 సగటుతో 345 పరుగులు చేశాడు.

రషీద్ ప్రపంచ ఎలెవన్

రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ, బాబర్ అజామ్, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), జాస్ బట్లర్ (కీపర్), బెన్ స్టోక్స్, మిచెల్ స్టార్క్, ఇమ్రాన్ తాహిర్, ట్రెంట్ బోల్ట్, కగిసో రబాడ

ABOUT THE AUTHOR

...view details