2023 టెస్టు ఛాంపియన్షిప్ నుంచి సుదీర్ఘ ఫార్మాట్ మ్యాచ్‌ను 4 రోజులకు కుదించాలన్న ఐసీసీ ప్రతిపాదనను... ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్ వ్యతిరేకించాడు. ఐదు రోజులు ఆట సాగితే మ్యాచ్‌లు ఉత్కంఠగా మారతాయని అన్నాడు. లేదంటే ఎక్కువ మ్యాచ్‌లు డ్రా అవుతాయని అభిప్రాయపడ్డాడు.
"అంతర్జాతీయంగా నేను చూసినంత వరకు కొన్ని అత్యుత్తమ టెస్టు మ్యాచ్‌లు 5 రోజులు సాగాయి. 2014లో భారత్ - ఆస్ట్రేలియా టెస్టులో ఐదోరోజు చివరి అరగంటలోనే మ్యాచ్ మలుపు తిరిగింది. 2014 కేప్ టౌన్ టెస్టులోనూ మ్యాచ్ ముగిసేందుకు రెండు ఓవర్లు ఉన్నాయనగా.. ర్యాన్ హారీస్‌ను బౌల్డ్ చేశాడు మోర్నీ మోర్కెల్. నాలుగు రోజుల టెస్టును నేను సమర్థించను. ఐదో రోజు లేకపోతే.. ఎక్కువ మ్యాచ్‌లు డ్రా అవుతాయి" -నాథన్ లయన్, ఆస్ట్రేలియా స్పిన్నర్.
టెస్టుల్లో వాతవారణం కూడా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పాడు లయన్.
"గతంతో పోలిస్తే ప్రస్తుతం పిచ్‌లు ఫ్లాట్‌గా ఉంటున్నాయి. ఇందువల్ల బ్యాట్స్‌మెన్ ఎక్కువ సేపు బ్యాటింగ్ చేసే అవకాశం కలుగుతుంది. ఇరుజట్లపై ఒత్తిడి పెరుగుతుంది. అలాంటి సమయాల్లో వికెట్లు తీసేందుకు స్పిన్నర్ల అవసరం ఎంతో ఉంటుంది. ఐదో రోజే వారికి సరిగ్గా అనుకూలిస్తుంది. ఈ విధానాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తా."
-నాథన్ లయన్, ఆస్ట్రేలియా స్పిన్నర్.
5 రోజుల ఫార్మాట్లో రోజుకు 90 ఓవర్లు బౌలింగ్ చేస్తుండగా... నాలుగు రోజులకు ఆటను కుదించిమ్యాచ్ను 98 ఓవర్లు నిర్వహించాలని భావిస్తోంది ఐసీసీ.ఇందుకు కారణం 2018 నుంచి ఇప్పటివరకు 60 శాతానికి పైగా మ్యాచ్‌లు నాలుగు రోజుల్లోపే ముగుస్తున్నాయి. ఫలితంగా 2023 నుంచి 2031 టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 4రోజుల టెస్టు మ్యాచ్ నిర్వహించేలా ప్రతిపాదించింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్.
ఇదీ చదవండి: అండర్-19 ప్రపంచకప్ జట్టు నుంచి నసీమ్ షా తొలగింపు