ప్రస్తుతం క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తోన్న ఆటగాళ్లలో ముందుగా వినిపించే పేరు విరాట్ కోహ్లీ. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ సత్తాచాటాడు. రెండో టెస్టులో (పుణె) డబుల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 254 పరుగులు చేసి టెస్టుల్లో తన వ్యక్తిగత స్కోరును పెంచుకున్నాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్మన్లలో జయసూర్య (21,032పరుగులు- 586 మ్యాచ్‌లు)ను అధిగమించి ఎనిమిదో స్థానానికి చేరాడు. ప్రస్తుతం కోహ్లీ 393 మ్యాచ్‌ల్లో 21,036 పరుగులతో కొనసాగుతున్నాడు.కోహ్లీ కంటే ముందున్న ఆ ఏడుగురి గురించి చూద్దాం.
7. బ్రియన్ లారా
వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్‌గా పేరు తెచ్చుకున్న లారా 22 వేల 358 పరుగులతో ఏడో స్థానంలో ఉన్నాడు. ఇందులో 53 సెంచరీలు, 111 అర్ధశతకాలు ఉన్నాయి. టెస్టుల్లో అత్యధికంగా 400 పరుగులు సాధించి రికార్డు సృష్టించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో ఇప్పటికీ అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన ఆటగాడిగా ఉన్నాడు లారా.
6. రాహుల్ ద్రవిడ్
మిస్టర్ డిపెండబుల్‌గా పేరు తెచ్చుకున్నాడు టీమిండియా క్రికెట్ రాహుల్ ద్రవిడ్. అంతర్జాతీయ క్రికెట్లో 24 వేల 208 పరుగులతో ఆరో స్థానంలో ఉన్నాడు. ఇందులో 48 శతకాలు, 146 అర్ధసెంచరీలు ఉన్నాయి. రావల్పిండి (2004)లో జరిగిన టెస్టులో సాధించిన 270 పరుగులు ఈ ఆటగాడి కెరీర్ బెస్ట్. 164 టెస్టులాడిన ద్రవిడ్ 13,288 పరుగులు సాధించాడు. ఇందులో 36 శతకాలు, 63 అర్ధశతకాలు ఉన్నాయి. 344 వన్డేలాడి 12 సెంచరీలు, 83 అర్ధసెంచరీలతో 10,889 పరుగులు నమోదు చేశాడు. ఒకే ఒక్క టీ20 మ్యాచ్ ఆడి అందులో 31 పరుగులు సాధించాడు.
5. జాక్వెస్ కలిస్
90వ దశకంలో బెస్ట్ ఆల్‌రౌండర్‌గా పేరు పొందాడు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాక్వెస్ కలిస్. అంతర్జాతీయ కెరీర్లో 25 వేల 534 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు. ఇందులో 62 సెంచరీలు, 149 అర్ధశతకాలు ఉన్నాయి. 166 టెస్టులాడిన కలిస్ 45 సెంచరీలు, 58 అర్ధసెంచరీలతో 13,289 పరుగులు సాధించాడు. 328 వన్డేల్లో 17 శతకాలు, 86 హాఫ్‌సెంచరీలతో 11,579 పరుగులు నమోదు చేశాడు. 25 టీ20 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించిన ఈ ఆటగాడు 5 అర్ధశతకాలతో 666 పరుగలు రాబట్టాడు. బ్యాట్స్‌మన్‌గానే కాక బౌలర్‌గానూ మంచి గుర్తింపు సాధించాడు కలిస్. మొత్తం 577 వికెట్లతో అలరించాడు.
4. జయవర్ధనే