భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లకు యోయో ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యం. ఆటగాళ్లు తమ ఫిట్నెస్ను నిరూపించుకోవాలంటే ఈ పరీక్షలో కచ్చితంగా పాస్ కావాల్సిందే. 2017లో టీమ్ఇండియా స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ శంకర్ బసు ఈ టెస్టును ప్రారంభించారు. అప్పటి నుంచి బీసీసీఐ భారత ఆటగాళ్ల ఫిట్‌నెస్‌కు దీనికి ప్రామాణికంగా భావిస్తోంది. యువరాజ్ సింగ్, సంజూ శాంసన్, అంబటి రాయుడు లాంటి ఆటగాళ్లు ఈ టెస్టులో పాస్ కాలేకపోయారు. కోహ్లీ, హార్దిక్ పాండ్యా లాంటి చురుకైన క్రికెటర్లు ఈ టెస్టులో అత్యధిక స్కోర్ సాధించారు.
యోయో టెస్టు ఎలా నిర్వహిస్తారు?
20 మీటర్ల దూరంలో ఆటగాళ్లు పరుగెత్తాలి. అయితే పరుగెత్తే సమయంలో బీప్ శబ్దం వచ్చిన సమయంలో ఆటగాళ్లు తిరిగి వెనక్కి పరుగెత్తాల్సి ఉంటుంది. ప్రతి నిమిషం తర్వాత బీప్ శబ్దాలు త్వరత్వరగా వస్తాయి. ఆ సమయానికి ఆటగాళ్లు నిర్ణీత సరిహద్దును చేరుకోవాలి. ఒక వేళ అలా చేరుకోకపోతే మరో రెండు బీప్ శబ్దాల లోపుగా వారు తమ లక్ష్యానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా సాఫ్ట్ వేర్ ఆధారంగా నిర్వహిస్తారు. ఆటగాళ్లు తమ సామర్థ్యం మేరకు దాదాపు గంటకు ఎనిమిది కోలోమీటర్ల వేగం నుంచి 22, 23 కిలోమీటర్లు పరుగెత్తుతుంటారు. ప్రస్తుతం టీమ్ఇండియా ఆటగాళ్లకు బీసీసీఐ 17.4 స్కోరును ప్రామాణికంగా నిర్ణయించింది.
యోయో టెస్టులో టాప్ స్కోరర్స్
5. ఆశిష్ నెహ్రా - 18.5
టీమ్ఇండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా తరచూ గాయాలబారిన పడి జట్టులో చోటు కోల్పోయేవాడు. కానీ ఈ గాయాలు ఇతడికి యోయో టెస్టులో ఎటువంటి ఆటంకం కలిగించలేకపోయాయి. కెరీర్ చివరి వరకు ఈ టెస్టులో పాల్గొన్న నెహ్రా.. 18.5 స్కోర్‌ను సాధించాడు. ప్రస్తుతం యోయో టెస్టులో అత్యధిక స్కోర్ సాధించిన భారత ఆటగాళ్లలో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.
4. కోహ్లీ, హార్దిక్ పాండ్యా - 19