అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతూ నిర్ణయం తీసుకున్నాడు టీమ్ఇండియా ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్. 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌తో జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన పఠాన్.. తర్వాత 2011 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు. తర్వాత భారత జట్టు ఎన్నో విజయాల్లో పాలుపంచుకున్న ఇతడు తన సోదరుడు ఇర్ఫాన్ పఠాన్‌తో 2007 టీ20 ప్రపంచకప్‌లో కలిసి ఆడాడు. తద్వారా ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తొలి సోదరుల జోడీగా రికార్డులకెక్కారు యూసఫ్-ఇర్ఫాన్. ఇర్ఫాన్ గతేడాది రిటైర్మెంట్ ప్రకటించాడు. కాగా, ఇప్పటివరకు వరల్డ్‌కప్ జట్టుకు ప్రాతనిధ్యం వహించిన సోదరులు మరికొందరూ ఉన్నారు. వారెవరో చూద్దాం.
స్టీవ్-మార్క్ వా
ప్రపంచ క్రికెట్లో ఎల్లకాలం గుర్తిండిపోయే సోదరులుగా నిలిచారు ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ వా-మార్క్ వా. వీరిద్దరూ 1992, 96, 99 ప్రపంచకప్‌లకు ప్రాతినిధ్యం వహించారు. 1999లో స్టీవ్ వా సారథ్యం వహించిన ఆసీస్ జట్టు విజేతగా నిలిచింది. 398 పరుగులతో ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు స్టీవ్ వా. రాహుల్ ద్రవిడ్ మొదటి స్థానంలో ఉన్నాడు. మార్క్ వా 375 పరుగులతో నాలుగో స్థానం కైవసం చేసుకున్నాడు.
మైఖెల్-డేవిడ్ హస్సీ
జాతీయ జట్టులోకి ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన సోదరులు మైఖెల్ హస్సీ, డేవిడ్ హస్సీ. వీరిద్దరూ ఆస్ట్రేలియా జట్టుకు 2011 ప్రపంచకప్‌లో ప్రాతినిధ్యం వహించారు. కానీ ఈ టోర్నీలో ఆస్ట్రేలియా క్వార్టర్ ఫైనల్లో టీమ్ఇండియా చేతిలో ఓడిపోయి ఇంటిముఖం పట్టింది. కానీ 2007 ప్రపంచకప్ విజేతగా నిలిచిన జట్టులో మైఖేల్ హస్సీ సభ్యుడిగా ఉన్నాడు. వీరిద్దరూ 2013లో తమ చివరి మ్యాచ్ ఆడారు.