తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆసీస్‌ బౌలర్లతో అందుకే దెబ్బలు తిన్నా: పుజారా - గబ్బా

గబ్బా టెస్టులో తన ప్రదర్శనపై మాట్లాడాడు నయావాల్‌ పుజారా. జట్టుకు ఏది మంచిదో తనకు తెలుసని అన్నాడు. విమర్శలు వచ్చినా.. మెల్లగా ఎందుకు ఆడాడో వివరించాడు పుజారా.

Took blows on body because defending with the bat was not safe on tricky Gabba wicket: Cheteshwar Pujara
ఆసీస్‌ బౌలర్లతో అందుకే దెబ్బలు తిన్నా: పుజారా

By

Published : Jan 28, 2021, 5:05 PM IST

ఆస్ట్రేలియా పర్యటనలో తన బ్యాటింగ్‌పై విమర్శలు వచ్చినా కావాలనే నెమ్మదిగా ఆడినట్లు టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌ ఛెతేశ్వర్‌ పుజారా అన్నాడు. ఈ పర్యటనలో మూడు అర్ధశతకాలు సాధించిన అతడు మొత్తం 271 పరుగులు చేశాడు. దాంతో జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానెల్లో మాట్లాడిన నయావాల్‌ గబ్బా టెస్టులో ఆసీస్‌ బౌలర్ల దెబ్బలను కాచుకోడానికి గల కారణాన్ని వివరించాడు.

'గబ్బా టెస్టులో ఎలా ఆడాలో నాకు స్పష్టమైన అవగాహన ఉంది. చివరిరోజు తొలి సెషన్‌లో వికెట్లు కోల్పోకూడదని అనుకున్నా. ఎందుకంటే అది రెండు, మూడో సెషన్లలో ఆస్ట్రేలియాకు అనుకూలంగా మారుతుంది. అయితే, అనుకోకుండా ఒక వికెట్‌ కోల్పోవడం వల్ల పరుగులు రాకున్నా నేను క్రీజులో పాతుకుపోవాలని నిర్ణయించుకున్నా. తర్వాత రెండు, మూడు సెషన్లలో ధాటిగా ఆడాలనుకున్నా. కానీ, అప్పటికే పిచ్‌లో అనూహ్య మార్పులు కనిపించాయి. కొన్ని బంతులు తక్కువ ఎత్తులో రాగా, మరికొన్ని ఊహించిన దానికంటే ఎక్కువ బౌన్స్‌ అయ్యాయి. దాంతో ఆ బంతులను ఎదుర్కోవడం చాలా కష్టంగా అనిపించింది' అని పుజారా తెలిపాడు.

'ఆ బంతులను ఎదుర్కోవాలంటే ఒకటే మార్గం కనిపించింది. అది ప్రమాదమని కూడా తెలుసు. కాకపోతే వేరే అవకాశం లేకపోయింది. ఆసీస్‌ బౌలర్లు వేసే బంతులు గ్లోవ్స్‌కు తగిలితే అవి క్యాచ్‌లుగా వెళ్లే అవకాశం ఉండింది. దాంతో ఆ బంతుల్ని నా శరీరానికి తగిలించుకున్నా. బంతిని హెల్మెట్‌ మీద తగిలించుకోవడం మంచిదికాదు. అయినా, నేను దాని గురించి ఆలోచించలేదు. శరీరానికి తగిలినప్పుడు కొన్ని విపరీతమైన నొప్పిని కలిగించేవి. అన్నింటికంటే ఎక్కువ బాధించింది చేతివేళికి తాకిన బంతి. మెల్‌బోర్న్‌ టెస్టులో ప్రాక్టీస్‌ సమయంలో అదే వేలికి ఒక బంతి తగిలింది. దాంతో విపరీతమైన నొప్పి పుట్టింది. ఈ నేపథ్యంలోనే నా ఆట మంచిగా అనిపించకపోయినా, నెమ్మదిగా సాగినా వికెట్‌ కాపాడుకోవాలని అనుకున్నా. నిజం చెప్పాలంటే జట్టుకు ఏది మంచో.. ఎలా ఆడాలో నాకు బాగా తెలుసు. ఎందుకంటే జట్టుతో చాలా ఏళ్లుగా కలిసి ఆడుతున్నా. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు శక్తిసామర్థ్యాల మేరకు ఉత్తమ ప్రదర్శన చేయడానికే ప్రయత్నిస్తా' అని చెప్పాడు పుజారా.

ఇదీ చూడండి:పుజారా.. ది వారియర్ ఇన్ జెంటిల్​మెన్ క్రికెట్

ABOUT THE AUTHOR

...view details