తెలంగాణ

telangana

ETV Bharat / sports

'అంతా పిచ్​ మహిమ... సహనమే రక్ష'

చివరి టెస్టు ఆఖరి రోజున తమ బౌలర్లు సహనంగా ఉండాలని సూచించాడు ఆసీస్ స్టార్ బ్యాట్స్​మన్ స్టీవ్ స్మిత్. గబ్బా పిచ్ అనుకోని రీతిలో స్పందిస్తోందని చెప్పాడు. వర్షం గురించి ఆలోచించకుండా నియంత్రణలో ఉన్నవాటిపై దృష్టిసారించాలని అన్నాడు.

Tomorrow it will be about bowling in good areas, being patient: Smith
'పిచ్​ తేడాగా ఉంది.. బౌలర్లు ఓపికగా ఉండాలి'

By

Published : Jan 18, 2021, 6:54 PM IST

గబ్బా పిచ్​ అనూహ్యంగా స్పందిస్తోందని అన్నాడు ఆస్ట్రేలియా బ్యాట్స్​మన్ స్టీవ్ స్మిత్. కాబట్టి తమ బౌలర్లు ఓపికగా బౌలింగ్​ చేయడం ముఖ్యమని చెప్పాడు.

స్టీవ్ స్మిత్

"ఇప్పటికి మంచి స్థితిలోనే ఉన్నాం. కానీ పిచ్​ అనూహ్యంగా స్పందిస్తోంది. కాబట్టి రేపు నిలకడగా మంచి ప్రాంతల్లో బౌలింగ్​ చేయడం ముఖ్యం. పిచ్​ స్పందించే తీరు దృష్టిలో పెట్టుకొని ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటామని భావిస్తున్నా. సిడ్నీ కన్నా ఇది భిన్నమైన వికెట్. బౌలర్లు అనవసర ప్రయోగాలు చేయకూడదు. అది సత్ఫలితాలు ఇవ్వకపోవచ్చు. అనువైన ప్రాంతంలో నిలకడగా బౌలింగ్​ చేయాలి. రేపు ఆసక్తికర పోరు జరగబోతోంది. దానికోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం."

-స్టీవ్ స్మిత్, ఆస్ట్రేలియా బ్యాట్స్​మన్

గాయాలబారిన పడ్డ మిచెల్ స్టార్క్ ఆఖరి రోజున ఆడతాడని ఆశాభావం వ్యక్తంచేశాడు స్మిత్. స్పిన్నర్​ లైయన్​ తప్పక మంచి ప్రదర్శన చేస్తాడని చెప్పాడు.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో నాలుగో రోజు 328 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్​కు దిగింది భారత్. వర్షం కారణంగా ఆట నిలిచిపోయే సమయానికి 4/0తో ఉంది.

ఇదీ చూడండి:ఉత్కంఠగా గబ్బా టెస్టు.. గెలుపు ఎవరిదో?

ABOUT THE AUTHOR

...view details